Etv Bharat Prathidwani on YSRCP Fake Propaganda : ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదాన్ని వాడుకుని వదిలేశాడు. ఆయన బాబాయ్ వివేకా హత్య (Viveka Murder Case)ను ప్రతిపక్షంపై నెట్టాడు. తిరుమలలో పింక్ డైమాండ్ పోయిందని నానాయాగీ చేశాడు. కోడికత్తి డ్రామా నడిపించాడు. "నేరం మాదీ పాపం మీది" అన్నట్టుగా సాగుతోంది సీఎం మోహన్ రెడ్డి జగన్ రాజకీయం. ప్రతి సంఘటనను రాజకీయ స్వార్థానికి వాడుకోవడం, ఎదుటివారికి బురదపూయటం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టుకలోనే ఉంది.
అలాంటిదే ఇప్పుడు ఫింఛన్ల పంపిణీ వ్యవహారం కూడా. వైఎస్సార్సీపీ సేవలో తరించే ఓ అధికారితో ఇంటింటికీ ఫింఛన్లు అందకుండా చేసిన జగన్ ఆ పాపాన్ని తెలుగుదేశం పార్టీపై నెట్టే ప్రయత్నం చేశారు. పదేపదే ప్రజలను ఫూల్స్ చేయవచ్చని వైసీపీ భావిస్తోందా? మరోసారి మోసపోవడానికి జనం సిద్ధంగా ఉన్నారా? "తప్పుడు ప్రచారాలకు తాతలు వైఎస్సార్సీపీ నేతలు" అనే అంశంపై ఇదీ నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో సామాజిక ఉద్యమకారిణి గాయత్రి, వీఆర్వోల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఈర్ల శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.
'గీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారాలు' - ఐటీడీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
Deceased Old Woman Family Members Angry on Jogi Ramesh:ప్రభుత్వ నిర్లక్ష్యానికి సామాజిక పింఛన్ దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సచివాలయాల వద్ద పింఛన్‌ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఈసీ సూచనల మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఫలితంగాపింఛన్లకోసం వచ్చిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9 గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉన్నా బ్యాంకు నుంచి ఇంకా సొమ్ము తమ చేతికి రాలేదని మధ్యాహ్నం రావాల్సిందిగా చాలామందిని సచివాలయ సిబ్బంది వెనక్కి పంపారు. మరికొన్నిచోట్ల గంటల తరబడి వేచిచూసేలా చేశారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలో పింఛన్ కోసం వెళ్లి ఓ వృద్దురాలు మృతి చెందారు.