ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

పిల్లల భవిష్యనిధికి కేంద్రం కొత్త పథకం- రేపు ప్రారంభించనున్న కేంద్రమంత్రి నిర్మల - NPS Vatsalya Scheme - NPS VATSALYA SCHEME

NPS Vatsalya Scheme : పిల్లల భవిష్యత్‌ అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఎన్‌పీఎస్‌ వాత్సల్య పథకాన్ని ప్రకటించడం తెలిసిందే. ఈ పథకాన్ని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్‌ 18న (బుధవారం) ప్రారంభించనున్నారు.

nps_vatsalya-scheme
nps_vatsalya-scheme (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 17, 2024, 3:35 PM IST

NPS Vatsalya Scheme :దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్రం 2004లో జాతీయ పింఛన్ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రజలకు దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలు, పన్ను ప్రయోజనాలు సైతం కల్పిస్తుండడంతో విశేష ఆదరణ లభిస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఎన్‌పీఎస్ వాత్సల్య పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్ ), సుకన్య సమృద్ధి యోజన, తదితర పథకాల తరహాలోనే విధివిధానాలు ఉండనున్నాయి.

రూ.755చెల్లిస్తే 15లక్షలు- ఈ జీవిత బీమా పాలసీ అస్సలు వదులుకోవద్దు - Health Insurance

బడ్జెట్ 2024 సమావేశాల్లో ప్రకటించిన వాత్సల్య పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రారంభించనున్నారు. చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు "ఎన్పీఎస్ వాత్సల్య" పేరుతో కొత్త పథకానికి ప్రధాని మోదీ సర్కార్ శ్రీకారం చుట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని సెప్టెంబర్ 18న ప్రారంభించనున్నారు.

ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లో వాత్సల్య పథకాన్ని ప్రకటిస్తూ పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు దీర్ఘకాలంపాటు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి సరైన పథకంగా ఆమె అభివర్ణించారు. పింఛన్ల నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ పీఎఫ్ఆర్‌డీఏ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం పథకానికి సంబంధించిన పూర్తి విధివిధానాలు వెల్లడించనున్నారు.

ఎన్​పీఎస్ వాత్సల్య పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా దాదాపు 75ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర మంత్రి దేశవ్యాప్తంగా ఈ స్కీమ్‌ను ప్రారంభించనుండగా కొంత మంది బాల బాలికలకు అక్కడే వాత్సల్య ఖాతాలు తెరిచి పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్(PRAN ) మెంబర్‌షిప్ కార్డులు అందజేయనున్నారు. అలాగే స్కీమ్‌కు సంబంధించిన ఆన్‌లైన్ పోర్టల్, బ్రోచర్​ను కేంద్రమంత్రి నిర్మలమ్మ ఆవిష్కరిస్తారు.

ఎన్​పీఎస్ వాత్సల్య పథకంలో భాగంగా భారత పౌరులతో పాటు ఎన్‌ఆర్‌ఐలు, ఓవర్సీస్‌ సిటిజెన్స్‌‌ తమ పిల్లల పేరిట ఖాతాలు ప్రారంభించవచ్చు. ఏడాదికి కనీసం 1,000 రూపాయలు జమ చేసుకునే విలుంది. గరిష్ఠ పరిమితి ఏమీ లేదు. వాత్సల్య పొదుపు ద్వారా తల్లిదండ్రులకు పన్ను మినహాయింపు అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం 80సీ కింద లభిస్తున్న రూ.1.50లక్షల మినహాయింపుతో పాటు సెక్షన్‌ 80(సీసీడీ)(1బీ) కింద అదనంగా మరో రూ.50వేల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత అప్పటివరకూ పొదుపు చేసిన సొమ్ములో 60శాతాన్ని తీసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని సాధారణ పెన్షన్ చెల్లింపుల రూపంలో అందిస్తారు. పిల్లల్లో పొదుపు, ఆర్థిక బాధ్యతలపై అవగాహన కల్పించడం ఈ పథకం ఉద్దేశంగా తెలుస్తోంది.

భవిష్యత్ కోసం ఇన్వెస్ట్ చేయాలా? రిస్క్​ లేని టాప్​-10 స్కీమ్స్​ ఇవే! - Top 10 Risk Free Schemes

పోస్టాఫీస్​ సూపర్​ స్కీమ్​ - రూ. 555 చెల్లింపుతో రూ. 10 లక్షల ఇన్సూరెన్స్​! - ఆపై ఈ బెనిఫిట్స్​ కూడా! - Best Accidental Insurance Schemes

ABOUT THE AUTHOR

...view details