Telangana Tourism Tirupati Tirumala Tour Details: తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ఇక తెలంగాణ నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వెళ్తుంటారు. ట్రైన్, బస్సు.. అంటూ ఎలా వీలైతే అలా చేరుకుంటారు. అయితే ఎలా వెళ్లినా.. స్వామి వారిని దర్శించుకోవాలంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. లేదంటే టికెట్లు లభించక లైన్లలో గంటల తరబడి వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక పై అలాంటి అవసరం లేకుండా తెలంగాణ టూరిజం సంస్థ.. స్వామి వారిని దర్శించుకునేందుకు ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. అది కూడా తక్కువ ధరలోనే వెళ్లేందుకు అవకాశం కల్పిస్తోంది. మరి ధర ఎంత? ప్రయాణం ఎన్ని రోజులు? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..
TIRUPATI - TIRUMALA TOUR’ పేరుతో తెలంగాణ టూరిజం ఈ ప్యాకేజీని అందుబాటులో తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా ఈ టూర్ ఉంటుంది. ఈ ప్యాకేజీ 2 రాత్రులు, 1పగలు ఉంటుంది. ఈ ప్యాకేజీలో తిరుపతి, తిరుమల, తిరుచానూర్ కవర్ అవుతాయి.
ప్రయాణం వివరాలివే:
- మొదటి రోజు సాయంత్రం 5 గంటలకు కూకట్‌పల్లిలోని IRO నుంచి బస్సు బయల్దేరుతుంది. సాయత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌కు, 6:15 గంటలకు బేగంపేట్ టూరిజం ప్లాజాకు చేరుకుంటుంది. రాత్రి 7 గంటలకు బషీర్‌బాగ్ చేరుకుని అక్కడి నుంచి తిరుపతికి జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ రాత్రంతా జర్నీ ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. అక్కడ ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్లారు. ఫ్రెషప్ అయిన తర్వాత.. స్థానికంగా ఉన్న పలు ఆలయాలను చూస్తారు. ఆ తర్వాత శ్రీవారి శీఘ్ర దర్శనం ఉంటుంది. అనంతరం తిరుపతికి చేరుకుంటారు. అక్కడ లంచ్ చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
- మూడో రోజు ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌కు చేరుకోవటంతో ఈ ప్యాకేజీ ముగుస్తుంది.
శ్రీశైలం మల్లన్న దర్శనంతో పాటు రోప్ వే, బోట్ జర్నీ! - తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీలు!