How to Control Sugar Level :భోజనం చేసిన తర్వాత అంటే దాదాపు ఐదారు నిమిషాల్లోనే జీర్ణాశయం గ్లూకాన్ లైక్ పెప్టయిడ్-1(GLP-1) అనే హార్మోన్ స్రవిస్తుంది. అది ఆహారం నుంచి ఎక్కువ గ్లూకోజ్‌ను ఉత్పత్తి చేయకుండా కాలేయాన్ని నియంత్రిస్తుంది. కాలేయం ఉత్పత్తి చేసిన గ్లూకోజ్ రక్తంలో మరీ ఎక్కువగా చేరకుండా ఇన్సులిన్ విడుదల చేయాలని పాంక్రియాస్ (క్లోమగ్రంథి)ని జీఎల్‌పీ హార్మోన్ ఆదేశిస్తుంది. ఇది అంతటితో ఆగకుండా "కడుపు నిండిపోయింది, ఇంకేమీ తినలేం" అనే పరిస్థితిని కలిగిస్తుందట. ఇలాంటి ఎన్నో కీలక పనులు చేసే ‘జీఎల్‌పీ-1’ హార్మోన్ స్రావం మందగించడం వల్లే మధుమేహం (Diabetes) వస్తుంది. మధుమేహం సమస్యపై ఇప్పుడు వాడుతున్న మందులు జీఎల్‌పీ-1 చేయాల్సిన పనుల్ని కృత్రిమంగా చేస్తాయని, ఆ మందులతో పనిలేకుండా జీఎల్‌పీ-1 ప్రక్రియని సహజంగా పెంచే అవకాశంపై శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
10నిమిషాల్లో చిక్కటి గడ్డ పెరుగు - రసాయనాలు లేకుండానే చిన్న చిట్కాతో ఇలా తయారు చేసుకోండి
మధుమేహం కారణాలు, మందులు తదితర అంశాలపై అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ దిశగా చైనాలోని జియాంగ్నాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందడుగు వేశారు. జీఎల్‌పీ-1 హార్మోన్‌కీ జీర్ణవ్యవస్థలో ఉన్న బి.వల్గటాస్ అన్న బ్యాక్టీరియాకీ సంబంధం ఉందని కనుగొన్నారు. బి.వల్గటాస్ బ్యాక్టీరియా ఉన్న వాళ్లలో షుగర్ లెవల్స్ అదుపులో ఉన్నట్లు గమనించారు. (పరిశోధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఈ నేపథ్యంలో బి.వల్గటాస్‌ని సహజంగా పెంచడం ఎలా అని పరిశోధించిన శాస్త్రవేత్తలు ఎఫ్-ఫార్4 (FFAR4) అనే ప్రొటీన్‌తో ఇవి పెరుగుతున్నట్టు గమనించారు. ఈ ప్రొటీన్‌ని ఆహారంలో పెంచుకుంటే మధుమేహాన్ని అదుపులో ఉంచడమే కాదు తగ్గించొచ్చని చెబుతున్నారు.
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ విస్తరిస్తోంది. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడ్డారంటే జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అందుకే ఈ వ్యాధి బారిన పడకూడదని అందరూ కోరుకుంటారు. అయితే డయాబెటిస్ టైప్ 1, టైప్ 2 అని రెండు రకాలుగా ఉంటుంది.