Tips for Children Uniforms Washing:స్కూల్ ఏదైనా పిల్లలకు యూనిఫామ్ సాధారణమే. అయితే.. అవి చాలా వరకు వైట్, క్రీమ్ కలర్లో ఉంటుంటాయి. అవి వేసుకుంటే మంచి లుకింగ్ వస్తుంది. కానీ.. అసలు ప్రాబ్లమ్ వచ్చేసరికి వాషింగ్. ఎందుకంటే.. పిల్లలు ఒక్క దగ్గర కుదురుగా ఉండరు. ఈ క్రమంలోనే వాటిపై పెన్ను, పెన్సిల్ గీతలు, ఫుడ్, చాక్లెట్ మరకలు.. ఇలా ఏవేవో మరకలు పడుతుంటాయి. అప్పుడు వాటిని ఉతకడం తల్లులకు చాలా ఇబ్బందికరంగా మారుతుంది.
కొన్నిసార్లు ఎంత రుద్ది ఉతికినా ఆ మరకలు ఒక్కపట్టాన పోవు. మరి, మీరూ పిల్లల యూనిఫామ్స్ విషయంలో ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారా? అయితే, మీకోసం కొన్ని సూపర్ టిప్స్ తీసుకొచ్చాం. వాటిని ఫాలో అయ్యారంటే మరకలను ఈజీగా పోగొట్టడమే కాకుండా యూనిఫామ్స్‌ను కొత్తవాటిలా తెల్లగా మెరిపించవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నిమ్మరసం :యూనిఫామ్ మరకలు పోగొట్టడంలో నిమ్మరసం మంచి బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. దీనిలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఆమ్లం మరకలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. ఇందుకోసం ఒక నిమ్మ చెక్కను తీసుకొని స్కూల్ యూనిఫామ్‌పై మరకలు ఉన్న చోట బాగా రుద్దాలి. ఆపై సబ్బు నీటిలో నానబెట్టి బ్రష్‌తో రుద్ది వాష్ చేసుకుంటే మరకలు ఈజీగా తొలగిపోతాయంటున్నారు.
వెనిగర్ :ఇదీ యూనిఫామ్స్‌పై మొండి మరకలను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్నారు. దీనిలో పుష్కలంగా ఉండే బ్లీచింగ్ ఏజెంట్ లక్షణాలు అందుకు చాలా బాగా సహాయపడతాయి. ఇందుకోసం ఒక బకెట్లో కొద్దిగా వాటర్ తీసుకొని అర కప్పు వెనిగర్ వేసుకొని కలుపుకోవాలి. ఆపై ఆ వాటర్‌లో మరకలు ఉన్న యూనిఫాంను ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. అనంతరం బ్రష్‌తో స్క్రబ్ చేసి వాష్ చేసుకుంటే చాలు. ఎలాంటి మరకలైనా ఇట్టే పోతాయంటున్నారు నిపుణులు.
బేకింగ్ పౌడర్ : ఇందుకోసం ఒక చిన్నబౌల్లో కొద్దిగా బేకింగ్ పౌడర్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. ఆపై దాన్ని యూనిఫామ్‌పై మరకలున్న చోట అప్లై చేసుకోవాలి. కాసేపటి తర్వాత బ్రష్‌తో రుద్ది వాష్ చేసుకుంటే ఈజీగా మరకలు తొలగిపోతాయట.