Papikondalu Tourism :గోదారమ్మ ఒడిలో ప్రయాణిస్తూ ప్రకృతి అందాలను వీక్షిస్తూ సాగే పాపికొండలు విహారయాత్ర పర్యాటకులకు ఓ మధురానుభూతి. కానీ.. ఈ ఏడాది జులై నుంచి విహారయాత్రను నిలిపేసిన విషయం తెలిసిందే. దాంతో చాలా మంది పర్యాటకులు మళ్లీ పాపికొండల్లో విహారయాత్ర ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారందరికీ గుడ్ న్యూస్. గత నాలుగు నెలలుగా నిలిచిపోయిన పాపికొండలు టూర్‌ను తిరిగి ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన పాపికొండలు టూర్ పర్యాటకులను చాలా బాగా ఆకట్టుకుంటుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి దేవీపట్నం మీదుగా.. పాపికొండల మధ్య గోదావరిలో బోట్ రైడింగ్ చేస్తూ.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సాగే ఈ విహార యాత్ర ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తోంది. మీరు అలాంటి అందాలను ఆస్వాదించాలనుకుంటే.. పాపికొండలకు వెళ్లాల్సిందే. బోట్ల నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు చాలా రోజుల తర్వాత మళ్లీ ప్రారంభించిన.. పాపికొండల టూర్ ఇకపై రోజూ ఉంటుందని తెలిపింది ఏపీ టూరిజం శాఖ. అంతేకాదు.. పాపికొండల్లో ఒకట్రెండు రోజులు ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయని చెబుతున్నారు టూర్ నిర్వాహకులు.
ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోండిలా!
- రాజమండ్రి నుంచి పాపికొండలు టూర్ స్టార్ట్ అవుతుంది. ఆసక్తి గల పర్యాటకులుhttps://tourism.ap.gov.in/tours , www.aptourismrajahmundri.com వెబ్ సైట్లలో ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.
- అదేవిధంగా.. రాజమండ్రి నుంచి ప్రైవేట్ బోట్ట్రిప్‌లు అందుబాటులో ఉంటాయి. రాజమండ్రి నుంచి గండిపోచమ్మ టెంపుల్ వరకు వాహనాల్లో తీసుకెళ్లి.. అక్కడి నుంచి 75 కిలోమీటర్లు లాంచీల్లో గోదావరిలో టూర్ కొనసాగుతుంది. మధ్యాహ్న సమయంలో పాపికొండల వద్దకు రీచ్ అవుతారు.
- అక్కడ కొద్ది సమయం స్పెండ్ చేశాక.. తిరిగి బోటులో సాయంత్రానికి గండిపోచమ్మ టెంపుల్‌కి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి రాజమండ్రికి తీసుకొస్తారు.