తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

బరువు తగ్గాలనేవారికి సూపర్ స్నాక్ - కరకరలాడే "ఓట్స్ పకోడీ" - తింటూ తగ్గిపోండి! - OATS PAKODI RECIPE

ఆనియన్ పకోడీ రొటీన్ - ఓసారి ఇలా "ఓట్స్​"తో ట్రై చేయండి!

HOW TO MAKE OATS PAKODA
Oats Pakodi Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 26, 2025, 3:57 PM IST

Oats Pakodi Recipe in Telugu :పకోడీ అనగానే మనందరికీ ఉల్లిపాయ, చికెన్, పాలకూరతో చేసుకునేవే ముందుగా గుర్తొస్తాయి. ఎప్పుడూ రొటీన్​గా ఒకే రకమైన పకోడీలు తింటే బోరింగ్ ఫీల్ వచ్చేస్తుంది. అందుకే, చలికాలంలో సాయంత్రం పూట వేడివేడిగా ఓసారి ఇలా "ఓట్స్ పకోడీని" ప్రయత్నించి చూడండి. ఇవి మిగతా పకోడీలకంటే అద్భుతమైన రుచితో నోరూరిస్తాయి. అంతేకాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారూ వీటిని ఎంచక్కా తినేయొచ్చు! పైగా వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులువు. మరి, ఈ టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • గుప్పెడు - జీడిపప్పులు
  • ఒక కప్పు - ఓట్స్
  • 2 - ఉల్లిపాయలు
  • పావు కప్పు - శనగపిండి
  • పావు కప్పు - బియ్యప్పిండి
  • 3 - పచ్చిమిర్చి
  • గుప్పెడు - కరివేపాకు
  • కొద్దిగా - కొత్తిమీర తరుగు
  • అరటీస్పూన్ - గరంమసాలా
  • పావుటీస్పూన్ - పసుపు
  • తగినంత - కారం
  • కొద్దిగా - అల్లంవెల్లుల్లి పేస్ట్
  • రుచికి సరిపడా - ఉప్పు
  • నూనె - వేయించడానికి సరిపడా

కరకరలాడే క్యాబేజీ పకోడి- ఇలా చేస్తే ఇంట్లోనే క్యాటరింగ్ టేస్ట్ పక్కా!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఓట్స్​ను తీసుకొని అవి పూర్తిగా నిండిపోయేలా కాకుండా సగం వరకు మాత్రమే వాటర్ పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి.
  • అవి నానేలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే, జీడిపప్పు పలుకులు, కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని పక్కనుంచాలి.
  • ఓట్స్ చక్కగా నాని మెత్తగా అయ్యాయనుకున్నాక వాటర్ వడకట్టి వాటిని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి
  • ఆపై అందులో శనగపిండి, బియ్యప్పిండి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి.
  • అనంతరం ముందుగా తరిగి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ, పచ్చి మిర్చి తరుగు వేసుకొని మరోసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఉప్పు, సన్నగా తరుక్కున్న జీడిపప్పుపలుకులు, కొత్తిమీర, కరివేపాకు తరుగు, కారం, పసుపు, గరంమసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్ ఇలా మిగతా ఇంగ్రీడియంట్స్​ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పకోడీ పిండి మాదిరిగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న ఓట్స్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకొని పకోడిల్లా వేసుకోవాలి.
  • ఆపై మీడియం ఫ్లేమ్ మీద అన్ని వైపులా పకోడీ చక్కగా కాలేంత వరకు వేయించుకోవాలి. ఎర్రగా వేగి, గోల్డెన్ కలర్​లోకి వచ్చాయనుకున్నాక వాటిని తీసి టిష్యూ పేపర్ పరచిన ప్లేట్​లో వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా టిష్యూ పేపర్ అదనపు నూనెను పీల్చేస్తుంది.
  • ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీ అండ్ క్రిస్పీ "ఓట్స్ పకోడీ" రెడీ!
  • మరి, నచ్చిందా మీరూ ఓసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు.

చల్లటి సాయంత్రం వేళ కమ్మటి "ఎగ్​ బోండా"- సింపుల్​గా ఇంట్లో చేసేయండిలా!!

ABOUT THE AUTHOR

...view details