తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

సూపర్ స్నాక్ : కేరళ స్పెషల్ "బెల్లం అప్పాలు" - ఒక్కసారి తింటే వదిలిపెట్టరంతే! - BELLAM APPALU RECIPE

ఈవెనింగ్ టైమ్ అద్దిరిపోయే స్నాక్ రెసిపీ - ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు!

Snack Recipe
Bellam Appalu Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2025, 7:29 AM IST

Bellam Appalu Recipe in Telugu :మనలో చాలా మంది స్వీట్ రెసిపీలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి వారికోసం ఒక స్పెషల్ స్నాక్ రెసిపీ తీసుకొచ్చాం. అదే, "కేరళ స్పెషల్ బెల్లం అప్పాలు". మీరు ఇప్పటి వరకు చాలా రకాలుగా అప్పాలు చేసుకొని ఉంటారు. కానీ, ఓసారి ఈ బెల్లం అప్పాలను ట్రై చేసి చూడండి. చాలా రుచికరంగా ఉంటాయి. చూడ్డానికి సాఫ్ట్ అండ్ స్పాంజీగా కనిపించే వీటిని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పైగా చాలా తక్కువ టైమ్​లో ఎవరైనా ఈ అప్పాలను ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి, ఈ సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యం - 1 కప్పు
  • ఉడికించిన అన్నం - పావు కప్పు
  • పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • బెల్లం తురుము - 1 కప్పు
  • నెయ్యి - 1 టేబుల్​స్పూన్
  • తరిగిన పచ్చికొబ్బరి ముక్కలు - 1 కప్పు
  • ఉప్పు - చిటికెడు
  • యాలకుల పొడి - పావుటీస్పూన్
  • బేకింగ్ సోడా - పావుటీస్పూన్
  • కొబ్బరి నూనె - తగినంత

పుట్నాల పప్పుతో సూపర్ "టేస్టీ చిక్కీలు"! - ఇలా తయారు చేస్తే రుచి అద్భుతం!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక బౌల్​లో బియ్యాన్నితీసుకొని శుభ్రంగా కడిగి, ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి.
  • అనంతరం నానబెట్టిన బియ్యాన్ని వాటర్ వడకట్టి మిక్సీ జార్​లోకి తీసుకోవాలి. ఆపై అందులో ఉడికించిన అన్నం, పచ్చికొబ్బరి తురుము, జీలకర్ర, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత పిండిని ఒక మిక్సింగ్ జార్​లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై సాస్ పాన్ పెట్టుకొని బెల్లంతురుము, అర కప్పు వాటర్ పోసుకొని బెల్లం పూర్తిగా కరిగే వరకు మరిగించుకోవాలి.
  • బెల్లం పూర్తిగా కరిగాక మరికాసేపు మరిగించుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఆపై పాన్​ని దింపి పాకాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
  • అనంతరం స్టౌపై మరో పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక తరిగిన పచ్చికొబ్బరి ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్​లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవి వేగాక వాటిని ఒక బౌల్​లోకి తీసుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యప్పిండి మిశ్రమంలో పూర్తిగా చల్లారిన బెల్లం పాకాన్ని వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. అయితే, పిండి మిశ్రమం మరీ గట్టిగా కాకుండా కాస్త పలుచగా ఉండేలా మిక్స్ చేసుకోవాలి.
  • ఆవిధంగా మిక్స్ చేసుకున్నాక అందులో ఉప్పు, యాలకుల పొడి, బేకింగ్ సోడా వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిసేలా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు పక్కనుంచాలి.
  • ఇప్పుడు స్టౌపై చిన్న గుంత కడాయి పెట్టుకొని 1 టేబుల్​స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒకటిన్నర గంటెలు కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమం వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత మూత తీసి అప్పంను టర్న్ చేసి రెండో వైపూ కొద్దిసేపు కాలనివ్వాలి. ఆవిధంగా కాల్చుకున్నాక దాన్ని ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇలానే పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే కమ్మని కేరళ స్టైల్ "బెల్లం అప్పాలు" రెడీ!

కరకరలాడే "ఎగ్ కట్​లెట్స్" - నిమిషాల్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ వేరే లెవల్​ అంతే!

ABOUT THE AUTHOR

...view details