How to Make Jonna Dosa Easily :ఆరోగ్యంగా ఉండాలన్నా, ఊబకాయం రాకూడదన్నా జొన్నలు చాలా మంచి ఆప్షన్ అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ.. జొన్నలు తినాలంటే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. జొన్న రొట్టెలు చేయాలంటే "మా వల్ల కాదు" అని అనుకుంటారు. అయితే.. కొన్ని టిప్స్ పాటిస్తే.. జొన్నలతో ఈజీగా రెసిపీలు తయారు చేసుకోవచ్చు. అలాంటి వాటిల్లో ఒకటే జొన్న దోశలు.
వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన పనిలేదు. జొన్న రొట్టెల కంటే వేగంగా జొన్న దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు! రొట్టెలు తయారు చేయడం రాని వారూ వీటిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీటిని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇంతకీ.. ఈ రుచికరమైన, ఆరోగ్యాన్నిచ్చే జొన్న దోశల తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- జొన్నపిండి - 1 కప్పు
- బియ్యప్పిండి - పావు కప్పు
- రవ్వ - పావు కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- జీలకర్ర - అర టీస్పూన్
- అల్లం తరుగు - కొంచెం
- పచ్చిమిర్చి - 3
- కొత్తిమీర, క్యారెట్ తురుము - కొద్దిగా
- వాటర్ - కావాల్సినంత
- నూనె - కొంచెం
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన పచ్చిమిర్చిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని సన్నని తురుములా తరిగి పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని జొన్నపిండి, బియ్యప్పిండి, రవ్వ వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని పచ్చిమిర్చి తరుగు, అల్లం తురుము, ఉప్పు వేసుకొని తగినన్ని వాటర్ కలుపుకుంటూ పిండిని కలుపుకోవాలి.
- అయితే, మామూలు దోశల పిండి కన్నా కాస్త పలుచగానే ఉండేవిధంగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకొని కాసేపు పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం.. స్టౌపై దోశ పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. అది హీట్ అయ్యాక కాస్త నూనె అప్లై చేసి.. గరిటెతో కొద్దిగా పిండిని తీసుకొని వీలైనంత పలుచగా దోశలా వేసుకోవాలి.
- తర్వాత దానిపై కొద్దిగా క్యారెట్, కొత్తిమీర తురుము వేసుకొని.. అంచుల వెంబడి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే 'ఇన్స్టెంట్ జొన్న దోశలు' రెడీ!
- ఇక వీటిని టమాటా, పల్లీ, కొబ్బరి, అల్లం.. ఇలా ఏ చట్నీలో అద్దుకొని తిన్నా రుచి చాలా బాగుంటుంది!
ఇవీ చదవండి :
మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తయారీకి టైమ్ లేదా? - ఈ "ఇన్స్టంట్ దోశ"ను ట్రై చేయండి - 5 నిమిషాల్లోనే రెడీ!
నోరూరించే "పాలకూర దోశ" - ఆకుకూరలు తినని వారికి బెస్ట్ ఛాయిస్ - ప్రిపరేషన్ వెరీ ఈజీ!