Visakhapatnam To Uttarakhand IRCTC Tour : ఇండియన్ రైల్వే అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకొనే యాత్రికులకు, ప్రకృతి అందాలు చుట్టిరావాలనుకొనే ప్రయాణికుల కోసం అనేక టూరిజం ప్యాకేజీలను తీసుకుకవస్తోంది. తాజాగా ఒకే టూర్లో దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌లోని ఆధ్యాత్మిక ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు చూసేలా అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. ఇంతకీ, ఈ టూర్ ఎన్ని రోజులు? ఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
"దేవ్ భూమి ఉత్తరాఖండ్ యాత్ర(Dev Bhoomi Uttarakhand Yatra)" పేరుతో ఈ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చిందిఐఆర్సీటీసీ. ఈ టూర్ మొత్తం 10 రాత్రులు, 11 పగళ్లుగా కొనసాగనుంది. వైజాగ్ నుంచి రైలు ప్రయాణం ద్వారా ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తున్నారు. భారత్ గౌరవ్ మానస్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఈ పర్యటన ఉంటుంది.
ప్రయాణ వివరాలు చూస్తే..
డే1..
మొదటి రోజు రాత్రి 8 గంటలకు విశాఖపట్నంరైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది.
డే2..
రెండో రోజు మొత్తం ట్రైన్లోనే జర్నీ ఉంటుంది.
డే3..
మూడో రోజు మార్నింగ్ తనక్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ రైలు దిగి హోటల్లో చెక్ ఇన్ అవుతారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత పూర్ణగిరి వెళ్తారు. ఈవెనింగ్ శారదా రివర్ ఘాట్ వద్దకు వెళ్తారు. నైట్ అదే హోటల్లో డిన్నర్, బస చేస్తారు.
డే4..
మార్నింగ్ హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత చెక్ అవుట్ అయి చంపావత్ బయలు దేరుతారు. అక్కడ బాలేశ్వర్, టీ గార్డెన్స్, మాయావతి ఆశ్రమం వంటి ప్రదేశాలను వీక్షిస్తారు. అనంతరం రాత్రికి చంపావత్‌లోని హోటల్లో చెక్ ఇన్ అవుతారు. నైట్ డిన్నర్, స్టే అక్కడే ఉంటుంది.
డే5..
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ అయి హాత్ కాలికా టెంపుల్ సందర్శనకు వెళ్తారు. లంచ్ అనంతరం పాటల్ భువనేశ్వర్ సందర్శిస్తారు. ఆ తర్వాత చౌకోరికి బయలుదేరుతారు. నైట్ అక్కడి హోటల్ చెన్ ఇన్ అవుతారు. డిన్నర్, స్టే అక్కడే చేస్తారు.
వైజాగ్ to అండమాన్ - IRCTC స్పెషల్ ప్యాకేజీ - బీచ్‌లో ఫుల్ చిల్ అవ్వొచ్చు బాస్!