ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

మహా కుంభమేళాకు వెళ్లాలనుకుంటున్నారా? - IRCTC సూపర్​ ప్యాకేజీ! - IRCTC MAHA KUMBH TOUR

-కుంభమేళాతోపాటు వారణాసి, అయోధ్య దర్శనం కూడా -తక్కువ ధరకే ఆధ్యాత్మిక టూర్​

IRCTC Maha Kumbh Tour from Secunderabad
IRCTC Maha Kumbh Tour from Secunderabad (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 6 hours ago

IRCTC Maha Kumbh Tour from Secunderabad : ప్రతి 12 సంవత్సరాలకూ ఒకసారి జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ సిద్ధమైపోయింది. ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులపాటు జరిగే మహా కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. పవిత్ర నదుల్లో పుణ్య స్నానం ఆచరిస్తే మోక్షం కలుగుతుందని చాలా మంది భక్తులు విశ్వసిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తారు. మరి మీరు కూడా ఈ మహా కుంభమేళాకు వెళ్దామనుకుంటున్నారా? అయితే.. మీకు ఐఆర్​సీటీసీగుడ్​న్యూస్​ చెబుతోంది. 'భారత్​ గౌరవ్​ టూరిస్ట్​ ట్రైన్'​ ద్వారా కుంభమేళాకు కొత్త ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి, ఈ టూర్​ ఎప్పుడు మొదలవుతుంది? ధర ఎంత? ఏయే ప్రదేశాలు చూడొచ్చు? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

IRCTC టూరిజం శాఖ "మహా కుంభ పుణ్యక్షేత్ర యాత్ర" (MAHA KUMBH PUNYA KSHETRA YATRA) పేరుతో టూర్​ ప్యాకేజీ తీసుకొచ్చింది. మహా కుంభమేళా టూర్ ప్యాకేజీ​ మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లు ఉంటుంది. ఈ ట్రైన్​ జర్నీ హైదరాబాద్‌ నుంచి మొదలవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్‌, కాజీపేట, వరంగల్​, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, తుని, దువ్వాడ, విజయనగరం రైల్వే స్టేషన్లలో భక్తులు ఈ ట్రైన్​ ఎక్కొచ్చు. మహా కుంభమేళాతో పాటు వారణాసి, అయోధ్య కూడా చూడచ్చు.

జర్నీ ఇలా :

  • మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి రైలు​ ప్రారంభమవుతుంది. కాజీపేట, వరంగల్​, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రిలో స్టేషన్లలో రైలు ఎక్కొచ్చు.
  • రెండవ రోజు తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా ప్రయాణించి మూడవ రోజు మధ్యాహ్నానికి వారణాసి చేరుకుంటారు.
  • అక్కడి నుంచి హోటల్​కు వెళ్లి అక్కడ చెకిన్ అవుతారు. ఈవెనింగ్​ వారణాసిలో గంగా హారతి వీక్షించి ఆ నైట్​కి అక్కడే స్టే చేస్తారు.
  • నాలుగో రోజు ఉదయం టిఫెన్​ చేసిన​ తర్వాత ప్రయాగరాజ్​ బయలుదేరుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అవుతారు. ఆ తర్వాత అక్కడే లంచ్​ ఉంటుంది. భోజనం చేసిన తర్వాత మహా కుంభమేళాకు వెళ్తారు. ఆ రోజంతా అక్కడే ఉండి ఆ నైట్​కి ప్రయాగరాజ్​లోని టెంట్​ సిటీలో స్టే చేస్తారు.
  • ఐదో రోజు మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్​ తర్వాత వారణాసి బయలుదేరుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అవుతారు. అక్కడ కాశీ విశ్వనాథ్​, కాశీ విశాలక్ష్మీ, అన్నపూర్ణ దేవి ఆలయాలను దర్శించుకుంటారు. ఆ నైట్​కి అక్కడే భోజనం చేసి స్టే చేస్తారు.
  • ఆరో రోజు హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అవుతారు. అక్కడి నుంచి అయోధ్యకు బయలుదేరుతారు. అక్కడ శ్రీరామ జన్మభూమి, హనుమాన్​ దేవాలయాలను సందర్శిస్తారు. ఆ నైట్​కి అయోధ్య నుంచి హైదరాబాద్​కు తిరుగు ప్రయాణమవుతారు. నైట్​ మొత్తం జర్నీ ఉంటుంది.
  • ఏడో రోజు కూడా మొత్తం ప్రయాణం ఉంటుంది.
  • అలా సికింద్రాబాద్​ చేరుకోవడంతో టూర్ ప్యాకేజీ​ ముగుస్తుంది.

ప్యాకేజీ ఛార్జీలు:

  • ఎకానమీ (SL) క్లాస్‌లో పెద్దలకు రూ. 22,635, 5-11 సంవ్సతరాల చిన్నారులకు రూ.21,740గా ధర నిర్ణయించారు.
  • స్టాండర్డ్​ (3AC) క్లాస్‌లో పెద్దలకు రూ.31,145, 5-11 సంవత్సరాల పిల్లలకు రూ.30,095 ధరగా నిర్ణయించారు.
  • కంఫర్ట్‌ (2AC) క్లాస్‌లో పెద్దలకు రూ.38,195, 5- 11 సంవత్సరాల పిల్లలకు రూ.36,935 చెల్లించాల్సి ఉంటుంది.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • టూర్​ ప్యాకేజీని బుకింగ్​ చేసుకున్న దాన్ని బట్టి రైళ్లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్‌ క్లాసులో జర్నీఉంటుంది.
  • అలాగే హోటల్​ అకామడేషన్​
  • మార్నింగ్​ కాఫీ, బ్రేక్​ఫాస్ట్​, లంచ్​, డిన్నర్​
  • ప్రయాణికులకు ట్రావెల్​ ఇన్సూరెన్స్​ కవర్​ అవుతుంది.
  • ప్యాకేజీలో లేని ప్రదేశాలను చూడాలన్నా, గైడ్‌ని నియమించుకోవాలన్నా యాత్రికులే చూసుకోవాలి.
  • ఐఆర్​సీటీసీ మహా కుంభమేళా ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీని బుక్​ చేసుకునేందుకు ఈలింక్​పై క్లిక్​ చేయండి.

కాశీ వెళ్లాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం - IRCTC మహా కుంభమేళా ప్యాకేజీ

కొత్త సంవత్సరంలో జ్యోతిర్లింగాలు దర్శించుకుంటారా? - తక్కువ ధరకే IRCTC ప్యాకేజీ - ఈ ప్రదేశాలూ చూడొచ్చు!

ABOUT THE AUTHOR

...view details