Instant Ragi Dosa Recipe in Telugu:చాలా మంది ఇష్టపడే టిఫెన్లలో దోశ ఒకటి. కానీ దీనిని చేయాలంటే ముందు రోజే రాత్రి పిండిని పులియబెట్టుకోవాలి. దీంతో ఇదంతా కాస్త ప్రాసెస్‌తో కూడుకున్న పని అని వదిలేస్తారు చాలా మంది. కానీ ఈ పద్ధతి పాటిస్తే ఈజీగా ఇంట్లోనే ఇన్‌స్టాంట్‌గా దోశలు చేసుకోవచ్చు. కేవలం 10 నిమిషాల్లోనే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులతో దోశలు చేసుకోవచ్చు. దీని వల్ల అటు ఆరోగ్యంతోపాటు ఇటు సమయం కూడా ఆదా అవుతుందని అంటున్నారు. అంతేకాదు దానికి కాంబినేషన్‌గా నోరూరించే టమాట పచ్చడిని కూడా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి..ఇంకెందుకు ఆలస్యం ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- ఒక కప్పు రాగి పిండి
- పావు కప్పు బొంబాయి రవ్వ
- ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి
- రుచికి సరిపడా ఉప్పు
- పావు కప్పు పెరుగు
తయారీ విధానం
- ముందుగా ఓ గిన్నెలో రాగిపిండి, బొంబాయి రవ్వ, బియ్యం పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి.
- ఇందులోనే పెరుగు, కొద్దిగా కొద్దిగా నీళ్లు పోస్తూ దోశ పిండిలా బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టాలి.
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి ఓ పెనం పెట్టుకుని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేడి చేసుకుంటూనే.. దోశ పిండి మూత తీసి మరోసారి బాగా కలపాలి.
- పెనం వేడయ్యాక కాస్త నూనె పోసి ఉల్లిపాయ లేదా టిష్యూ పేపర్‌తో స్ప్రెడ్ చేయాలి.
- ఆ తర్వాత కాస్త పిండిని తీసుకుని దోశ వేసుకుని దానిపై కాస్త నూనె పోసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అంతే హెల్దీ రాగి దోశ రెడీ!
టమాటా చట్నీకి కావాల్సిన పదార్థాలు
- అర కప్పు ఉల్లిపాయ ముక్కలు
- రెండు టమాటా ముక్కలు
- చిన్న అల్లం ముక్క
- 10 వెల్లుల్లిపాయలు
- ఉసిరికాయంత చింతపండు
- అర టీ స్పూన్ బెల్లం తురుము (ఆప్షనల్)
- రుచికి సరిపడా ఉప్పు
- అర టీ స్పూన్ జీలకర్ర
- 7 ఎండు మిరపకాయలు