తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

రోడ్ సైడ్ బండి రుచితో మిర్చీ బజ్జీ కావాలా? - ఈ టిప్స్ పాటిస్తే అద్దిరిపోయే టేస్ట్! - Mirchi Bajji Recipe - MIRCHI BAJJI RECIPE

How To Make Mirchi Bajji In Telugu : చల్లని సాయంత్రం వేళ.. టీ లేదా కాఫీతోపాటు ఓ నాలుగు మిర్చి బజ్జీలు తింటే ఎలా ఉంటుంది..? ఆ కిక్కే వేరు కదా! కానీ.. బయట తినాలంటే ఆరోగ్యం గురించిన టెన్షన్ ఉంటుంది. ఇంట్లో చేస్తేనేమో.. అక్కడి టేస్ట్ రాదని చాలా మంది ఫీలవుతుంటారు. ఇలాంటి వారికోసమే.. స్ట్రీట్​ స్టైల్లో నోరూరించే మిర్చి బజ్జీ రెసీపీ తెచ్చాం.

Mirchi Bajji In Telugu
How To Make Mirchi Bajji In Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 10:51 AM IST

How To Make Mirchi Bajji : ఈ వర్షాకాలంలో నాలుగు చినుకులు పడటమే ఆలస్యం.. వేడివేడి టీ/ కాఫీలతో పాటు బజ్జీలూ, పునుగులూ, పకోడీలు వంటి స్నాక్స్ తినాలనిపిస్తుంది. అయితే, ఈ స్నాక్స్​లో ఎన్ని రకాలున్నా.. మిర్చి బజ్జీ టేస్ట్​ వేరే లెవెల్లో ఉంటుంది. వేడివేడిగా అప్పుడే వేయించిన మిర్చి బజ్జీలను.. అలా ఉల్లిపాయలతో కలిపి కొరుక్కుని తింటే.. జిందగీ ఖుష్ అవుతుంది.

అయితే.. బయట తినాలంటే హెల్త్ టెన్షన్స్ ఉంటాయి. ఇంట్లో చేస్తేనేమో.. రోడ్​ సైడ్ బండి అంత టేస్ట్​ రాదు. అందుకే.. మీకోసం ఈ రెసిపీ తెచ్చాం. ఇక్కడ చెప్పే విధంగా మిర్చి బజ్జీలను ఇంట్లో చేశారంటే.. అచ్చం అదే టేస్ట్​ ఫీలవుతారు. అంతేకాదు.. మళ్లీ మళ్లీ ఇలానే ట్రై చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ?వేడివేడిగా మిర్చి బజ్జీలను సింపుల్​గా ఎలా చేయాలో చూసేద్దాం పదండి..

మిర్చి బజ్జీలు చేయడానికి కావాల్సిన పదార్థాలు :

  • బజ్జీ మిరపకాయలు -10
  • చింతపండు - కొద్దిగా
  • శనగపిండి- కప్పు
  • ఉప్పు- రుచికి సరిపడా
  • కారం- టీస్పూన్​
  • పసుపు - చిటికెడు
  • వాము- టీస్పూన్​
  • బియ్యం పిండి- అరకప్పు
  • వంటసోడా-చిటికెడు
  • నీళ్లు- కొద్దిగా

స్ట్రీట్​ స్టైల్​ మిర్చి బజ్జీలు తయారు చేయు విధానం :

  • ముందుగా చింతపండులో కొన్ని నీళ్లు పోసి.. చిక్కని చింత పండు గుజ్జును రెడీ చేసుకోవాలి. ఇందులోకి టేబుల్​స్పూన్​ శనగపిండి వేసి కలపండి.
  • ఆ తర్వాత కొద్దిగా వామును అరచేతిలో వేసుకుని బాగా నలిపి చింత పండు మిశ్రమంలో వేసి బాగా కలపండి.
  • ఇలా చింత పండు గుజ్జు కట్​ చేసిన మిర్చిలో స్టఫ్​ చేయడం వల్ల మిర్చి బజ్జీ చాలా రుచిగా ఉంటుందని గుర్తుంచుకోండి.
  • ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి, బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, వంటసోడా వేసి బాగా మిక్స్ చేయండి.
  • పిండి జారుగా, చిక్కగా కాకుండా నీళ్లను సరిపోయేంతంగా పోసుకోండి.
  • తర్వాత మిర్చిలను శుభ్రంగా కడిగి మధ్యలోకి కట్​ చేసుకోండి. ఇప్పుడు మధ్యలో మనం ప్రిపేర్​ చేసుకున్న చింతపండు మిశ్రమాన్ని స్టఫ్​ చేయండి.
  • ఇలా అన్ని మిర్చిలకూ చింతపండు గుజ్జు స్టఫ్​ చేసిన తర్వాత.. స్టౌపై పాన్​ పెట్టి.. అందులో మిర్చి బజ్జీలు వేయించడానికి సరిపడా ఆయిల్​ పోసుకోండి.
  • నూనె బాగా వేడైన తర్వాత శనగపిండి మిశ్రమంలో స్టఫ్ చేసుకున్న మిర్చి బజ్జీలను చిక్కగా ముంచి ఆయిల్లో ఫ్రై చేసుకోండి.
  • మిర్చిలు బాగా వేగిన తర్వాత.. వేడివేడిగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకుని తింటే టేస్ట్​ అద్దిరిపోతుంది.
  • అంతే ఇలా సింపుల్​గా మీకు ఎంతో ఇష్టమైన కరకరలాడే స్ట్రీట్​ స్టైల్ మిర్చి బజ్జీలను ఇంట్లోనే చేసుకోవచ్చు.
  • నచ్చితే మీరు కూడా ఇలానే మిర్చి బజ్జీలను ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్లందరూ సూపర్​గా చేశావని మీకు క్రెడిట్​ ఇవ్వడం ఖాయం!

ABOUT THE AUTHOR

...view details