తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

సండే స్పెషల్​: టేస్టీ అండ్​ స్పైసీ "చికెన్​ ధమ్​ కిచిడి" - ఒక్కసారి తిన్నారంటే రుచి మర్చిపోరు! - Chicken Dum Khichdi in Telugu - CHICKEN DUM KHICHDI IN TELUGU

చికెన్​తో ఎన్నో రకాల వంటకాలను చేసుకుని తింటుంటాం. అయితే, మీరు ఎప్పుడైనా చికెన్​ ధమ్​ కిచిడీ టేస్ట్​ చేశారా ? ఈ సండే రోజు ఈ రెసిపీ ట్రై చేయండి. టేస్ట్​ అద్దిరిపోతుందంతే..

Chicken Dum Khichdi
Chicken Dum Khichdi Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2024, 1:02 PM IST

Chicken Dum Khichdi Recipe : సండే వచ్చిందంటే ప్రతి ఇంట్లో నాన్​వెజ్​ తప్పకుండా వండుతారు. నాన్​వెజ్​లో చాలా మంది ఎంతో ఇష్టంగా తినేది..చికెన్. ఇక చికెన్​తో బిర్యానీ, ఫ్రై, కర్రీ, పులుసు ఇలా ఏది వండినా కూడా ఇంట్లో వాళ్లందరూ ఒకటికి రెండు ముద్దలు ఆరగిస్తారు. అయితే, చికెన్​తో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి చికెన్​ ధమ్​ కిచిడీ ట్రై చేయండి. దీనిని బ్యాచిలర్స్​ కూడా ఈజీగా వండుకోవచ్చు. వేడివేడిగా ఈ చికెన్​ ధమ్ కిచిడీని ఆనియన్​ రైతాతో తింటే టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. మరి ఈ ​ కిచిడీ ఎలా ప్రిపేర్​ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు..

  • చికెన్​- పావు కిలో
  • పెసరపప్పు- అర కప్పు
  • రైస్​ -కప్పు
  • నెయ్యి -2 టేబుల్​స్పూన్లు
  • ఉల్లిపాయ-ఒకటి
  • పచ్చిమిర్చి-4
  • షాజీరా- టీస్పూన్​
  • అల్లం పేస్ట్​-టీస్పూన్​
  • పసుపు -అరటీస్పూన్​
  • ఉప్పు -రుచికి సరిపడా
  • కారం-టీస్పూన్​
  • గరం మసాలా -అర టీస్పూన్​
  • లవంగాలు-5
  • యాలకులు-2
  • దాల్చినచెక్క
  • కరివేపాకు
  • కొత్తిమీర
  • పుదీనా

తయారీ విధానం..

  • చికెన్ దమ్ కిచిడి కోసం పెసరపప్పు గంటపాటు నానబెట్టుకోవాలి. అలాగే రైస్​ ఒక గంట సేపు నానబెట్టుకోవాలి.
  • చికెన్​ రెండుసార్లు శుభ్రంగా కడగాలి. చికెన్ కూడా గంటపాటు ఉప్పు నీటిలో​ నానబెట్టుకోవాలి. ఇలా చికెన్​ సాల్ట్​ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల ముక్క మెత్తగా కుక్​ అవుతుంది.
  • ముందుగా స్టౌ పై పాన్ పెట్టి నెయ్యి కరిగించుకోండి. ఇందులో షాజీరా, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నని మంట మీద వేయించండి. ఉల్లిపాయలు గోల్డెన్​ బ్రౌన్​ కలర్లో మారిన తర్వాత.. పెసరపప్పు వేసి కలపండి. తర్వాత బియ్యం వేసి కలపండి. బియ్యం ఫ్రై చేసుకోవడం వల్ల కిచిడి పొడిపొడిగా వస్తుంది.
  • ఇప్పుడు అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు, కారం, గరం మసాలా వేసి ఫ్రై చేయండి. సన్నని మంటమీద మసాలాలన్నీ రైస్​కి బాగా పట్టించండి.
  • ఇప్పుడు నానబెట్టుకున్న చికెన్​ వేసుకుని మూడు నిమిషాలు కుక్​ చేసుకోండి.
  • ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు రెండుగ్లాసుల నీళ్లను పోసుకుని మూతపెట్టి హై ఫ్లేమ్​లో కిచిడి 8 నిమిషాలు ఉడికించుకోండి.
  • తర్వాత సన్నని మంటమీద 10 నిమిషాలు కుక్​ చేసుకోండి. ఇప్పుడు స్టౌ ఆఫ్​ చేసుకుని కొద్దిసేపు ధమ్​ బయటకు పోకుండా చూడండి.
  • అంతే ఇలా చేసుకుంటే టేస్టీ అండ్​ స్పైసీ చికెన్​ ధమ్ కిచిడి రెడీ. ఈ కిచిడిని ఆనియన్​ లేదా దోసకాయ రైతాతో తింటే టేస్ట్​ అద్దిరిపోతుంది. నచ్చితే మీరు కూడా ఈ చికెన్ ధమ్​ కిచిడి ట్రై చేయండి.

రొటీన్ చికెన్​ కర్రీ వండుతున్నారా? - గ్రేవీ చికెన్ ఫ్రై, స్పెషల్ రైస్ - ఇలా ప్రిపేర్ చేయండి

గోంగూరతో చికెన్ కర్రీ మాత్రమే కాదు బిర్యానీ చేయవచ్చు - ఇలా ప్రిపేర్​ చేయండి - టేస్ట్​ సూపర్​!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details