ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

శనగపిండితో పకోడే కాదు, ఇలా కమ్మటి దోశలు కూడా! - పిల్లలు అస్సలు వదలరు! - SENAGA PINDI DOSA RECIPE IN TELUGU

- టేస్టీ అంట్​ హెల్దీ శనగపిండి దోశలు - ఇలా చేస్తే నిమిషాల్లోనే వేడివేడిగా ఎంతో రుచిగా!

Besan Dosa Recipe
Besan Dosa Recipe in Telugu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2025, 1:03 PM IST

Besan Dosa Recipe in Telugu : చాలా మంది బ్రేక్​ఫాస్ట్​లో దోశ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంట్లో అయినా ఏదైనా హోటల్​కి వెళ్లిన మార్నింగ్​ దోశతో డేని ​ప్రారంభించడం కొంతమందికి అలవాటు. అయితే, ఇంట్లో దోశలు చేయడానికి పిండి లేకపోతే ఒక్కసారి ఇలా శనగపిండితో కమ్మటి దోశలు ట్రై చేయండి. ఈ దోశలు చేయడానికి ఎక్కువ టైమ్​ పట్టదు. పైగా ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఒక్కసారి ఇలా దోశలు ఇంట్లో ట్రై చేస్తే పిల్లలు, పెద్దలందరూ ఎంతో ఇష్టంగా ఒకటికి రెండు లాగిస్తారు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈజీగా శనగపిండి దోశలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • ఉల్లిపాయలు-2
  • పచ్చిమిర్చి-1
  • క్యారెట్​-1
  • టమాటా-1
  • శనగపిండి-కప్పు
  • కారం-పావు టీస్పూన్​
  • పసుపు-పావు టీస్పూన్
  • మిరియాలపొడి-పావు టీస్పూన్
  • జీలకర్ర-టీస్పూన్​
  • వాము-పావుటీస్పూన్
  • ఇంగువ-రెండు చిటికెలు
  • ఉప్పు- రుచికి సరిపడా
  • సన్నగా తరిగిన కొత్తిమీర

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
  • ఆపై వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేసుకుని ఒక మిక్సింగ్​ బౌల్లోకి తీసుకోవాలి.
  • ఇందులోకి శనగపిండి వేసుకుని కలుపుకోవాలి. అనంతరం కారం, ఉప్పు, పసుపు, మిరియాలపొడి, జీలకర్ర, వాము, ఇంగువ, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని మిక్స్ చేయాలి.
  • ఆ తర్వాత కొద్దికొద్దిగా వాటర్​ కలుపుకుంటూ పిండిని మరీ పల్చగా, చిక్కగా కాకుండా దోశల పిండిలా రెడీ చేసుకోవాలి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే దోశ పిండి రెడీ. బౌల్​పై మూత పెట్టి 5 నిమిషాలు అలా వదిలేయండి.
  • ఇప్పుడు స్టౌపై దోశ పెనం పెట్టండి. పెనం వేడయ్యాక కాస్త ఆయిల్​ వేయండి.
  • ఆపై గరిటెడు దోశ పిండి తీసుకుని పెనంపై వేసి దోశలా తిప్పుకోండి.
  • దోశపైన, అంచుల వెంబడి కొద్దిగా నూనె చల్లి పెనంపై మూత పెట్టండి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత దోశను మరోవైపు తిప్పుకోండి.
  • ఇలా రెండు వైపులా దోశ కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. మిగిలిన పిండితో సింపుల్​గా దోశలు ఇలా వేసుకుంటే సరిపోతుంది.
  • అంతే ఇలా సులభంగా చేసుకుంటే ఎంతో రుచికరమైన శనగపిండి దోశలు మీ ముందుంటాయి.
  • వీటిని టమాటా, పల్లీ చట్నీతో తింటే రుచి అద్భుతంగా ఉంటాయి.
  • నచ్చితే ఓసారి ఇలా దోశలు ఇంట్లో ట్రై చేయండి.

మీ ఇంట్లో బ్రకోలీ తినట్లేదా? - పాలకూరతో కలిపి దోశ వేయండి - మొత్తం లాగిస్తారు!

ఇడ్లీ, దోశ పిండి పులియట్లేదా - ఇలా చేయండి చాలు అంతే

ABOUT THE AUTHOR

...view details