ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

టైల్స్ మధ్య మురికి పేరుకుపోయిందా? - ఈ చిట్కాలతో కొత్తవాటిలా తళతళా మెరిపించండి! - CLEAN TILE FLOORS IN TELUGU

-ఇంటి అందాన్ని మార్చేస్తున్న రంగురంగుల టైల్స్​ -ఇలా క్లీన్​ చేస్తే అద్దంలా మెరుస్తాయి!

How to Clean Tile Floors
How to Clean Tile Floors (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2025, 12:18 PM IST

How to Clean Tile Floors :ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంట్లో టైల్స్​ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కిచెన్​, హాల్​, బెడ్​రూమ్​ ఇలా రూమ్​కు తగ్గట్టు స్పెషల్​ అట్రాక్షన్​గా ఉండే టైల్స్​ వేయించుకుంటున్నారు. ఇంటి అందాన్ని టైల్స్​ మార్చేస్తాయడంలో ఎలాంటి సందేహం లేదు! అందుకే ఎక్కువమంది ఇదే ట్రెండ్​ని ఫాలో అవుతున్నారు. అయితే.. టైల్స్​నుఎప్పటికప్పుడు క్లీన్​ చేస్తున్నా సరే వాటి మధ్య మురికి చేరుతుంటుంది. ఈ క్రమంలో కొన్ని రోజుల్లో అవి చాలా మురికిగా మారిపోతాయి. తర్వాత ఆ మరకలను ఎంత ప్రయత్నించినా వదలవు. ఇలా చూస్తుండగానే కొత్త టైల్స్​ పాత వాటిలా మారిపోతాయి.

అయితే.. టైల్స్​ మధ్య చేరిన మురికిని కొన్ని టిప్స్​ ద్వారా పోగొట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చిట్కాల ద్వారా మురికి పోవడంతోపాటు కొత్తవాటిలా మెరిసిపోతూ ఉంటాయని అంటున్నారు. మరి ఆ టిప్స్​ ఏంటో ఈ ఇప్పుడు చూద్దాం..

వెనిగర్‌, వాటర్​:

గోరువెచ్చని నీళ్లు, వెనిగర్‌.. ఈ రెండింటినీ సమపాళ్లలో తీసుకొని ఒక మిశ్రమంగా చేసుకోవాలి. లిక్విడ్​ని స్ప్రే బాటిల్‌లో పోసి టైల్స్‌ మధ్య మురికి పేరుకున్న చోట కొద్దిగా స్ప్రే చేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత బ్రష్‌తో రుద్దితే మురికి వదిలిపోయి ఫ్లోర్‌ తళతళా మెరిసిపోతుంది.

హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ :

సాధారణంగా దెబ్బలు తగిలినప్పుడు ఆ భాగాన్ని శుభ్రం చేయడానికి హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ఉపయోగిస్తుంటాం. అయితే దీనిని టైల్స్‌ మధ్య చేరిన మురికిని పోగొట్టడానికి కూడా వాడచ్చు. దీన్ని నేరుగా ఫ్లోర్‌ని క్లీన్ చేయడానికి వాడుకోవచ్చు! లేదంటే ఇందులో కాస్త బేకింగ్‌ సోడాను యాడ్ చేసి చిక్కటి పేస్ట్‌లా ప్రిపేర్​ చేసి టైల్స్‌ మధ్య రాయాలి. కొద్దిసేపటి తర్వాత నీటితో కడిగేస్తే టైల్స్ మురికి మొత్తం తొలగిపోతుంది.

నిమ్మరసంతో :

ప్రతి ఇంట్లో నిమ్మకాయలు తప్పకుండా ఉంటాయి! అయితే, టైల్స్​ శుభ్రం చేయడానికి నిమ్మరసాన్ని వాటర్​లో కలిపి టైల్స్‌ మధ్య మురికిగా ఉన్న చోట స్ప్రే చేయాలి. అనంతరం స్క్రబ్బర్‌తో రుద్ది క్లీన్​ చేస్తే మురికి వదిలిపోతుంది. అయితే నిమ్మ వల్ల టైల్స్‌ నునుపుదనం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి.. కొద్దిగా ఎక్కువ వాటర్లో నిమ్మరసాన్ని కలిపితే సరిపోతుంది.

బేకింగ్​ సోడా:

బేకింగ్​ సోడా కూడా టైల్స్​ మధ్య మురికిని తొలగించడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందుకోసం ఒక గిన్నెలో బేకింగ్​ సోడాను తీసుకుని.. అందులో కొద్దిగా వాటర్​ పోసుకుని పేస్టులాగా చేసుకోవాలి. అనంతరం ఆ పేస్ట్​ను మురికి ఉన్న ప్రదేశంలో అప్లై చేసి 15 నిమిషాలపాటు అలా వదిలేయాలి. ఆపై స్క్రబ్బర్​ సాయంతో శుభ్రం​ చేస్తే మురికి వదులుతుందని నిపుణులు చెబుతున్నారు.

బాత్‌రూమ్‌లో మరకలు ఎన్నిసార్లు కడిగినా పోవట్లేదా? - ఈ టిప్స్‌ పాటిస్తే సరి!

ఫర్నిచర్ మీద ఒక్క మరక పడితే - 7 విధాలుగా తుడిచి పారేయండి!

ABOUT THE AUTHOR

...view details