తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

మిక్సీ అడుగు భాగం నల్లగా మారిందా? - ఈ టిప్స్​ పాటిస్తే క్షణాల్లో కొత్తదానిలా! - HOW TO CLEAN THE MIXER JAR BASE

-మిక్సీజార్​ అడుగు భాగం మురికిగా మారిందా? -ఇలా చేస్తే ఇట్టే మెరిసిపోతుంది

How to Clean the Mixer Jar Base
How to Clean the Mixer Jar Base (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Feb 1, 2025, 4:44 PM IST

How to Clean the Mixer Jar Base :వంటింట్లో రోజూ ఎన్నో వస్తువులు ఉపయోగిస్తుంటాం. వాటిలో మిక్సీలు కూడా ఒకటి. చట్నీలు, పొడులు, జ్యూస్​లు, పేస్ట్​లు అంటూ ఎన్నో వంటకాల కోసం మిక్సీ జార్​లను వాడుతుంటాం. అయితే వాడటం వరకు బానే ఉన్నా వాటి క్లీనింగ్​ విషయానికి వచ్చేసరికి చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. కేవలం పైపైనే శుభ్రం చేసి మమా అనిపిస్తుంటారు. ఫలితంగా మిక్సీ జార్​ లోపల బ్లేడ్లు పదును తగ్గడం సహా గిన్నె అడుగు భాగానా నల్లగా పేరుకుపోతుంది. దీంతో వాటిని క్లీన్​ చేయడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. అయితే కొన్ని టిప్స్​ పాటిస్తే మిక్సీ జార్​ అడుగు భాగాన్ని ఈజీగా క్లీన్​ చేసుకోవచ్చని చెబుతున్నారు కిచెన్ ఎక్స్​పర్ట్స్​. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

డిష్​వాషింగ్​ లిక్విడ్​:

  • ఓ గిన్నెలోకి 2 టీ స్పూన్ల డిష్​వాషింగ్​ లిక్విడ్​, 1 టీ స్పూన్​ బేకింగ్​ సోడా, కొద్దిగా వెనిగర్​ పోసి పేస్ట్​లాగా చేయాలి.
  • ఆ తర్వాత ఆ పేస్ట్​ను మిక్సీ జార్​ అడుగు భాగాన అప్లై చేసి ఓ పావు గంట సేపు వదిలేయాలి.
  • అనంతరం టూత్​బ్రష్​ సాయంతో బాగా రుద్దాలి. ఆ తర్వాత వాటర్​తో క్లీన్​ చేసి పొడి వస్త్రంతో తుడిస్తే సరి. అడుగున ఉన్న మురికి పోయి శుభ్రంగా ఉంటుంది.

డిటర్జెంట్ వాషింగ్​​ పౌడర్​:

  • ఓ గిన్నెలోకి 2 టేబుల్​ స్పూన్ల డిటర్జెంట్​ వాషింగ్​ పౌడర్​ వేయాలి. ఆ తర్వాత అందులోకి 1 టేబుల్​ స్పూన్​ ఉప్పు వేసి, ఆ రెండింటిని బాగా కలపాలి.
  • ఆ తర్వాత కొన్ని వాటర్​ కలుపుకుని పేస్ట్​లాగా చేసుకోవాలి.
  • ఆ పేస్ట్​ను మిక్సీ జార్​ అడుగు భాగాన అప్లై చేసి ఓ పావు గంట సేపు వదిలేయాలి.
  • అనంతరం టూత్​బ్రష్​ సాయంతో బాగా రుద్ది వాటర్​తో క్లీన్​ చేసి పొడి వస్త్రంతో తుడిస్తే సరి.

వెనిగర్​, బేకింగ్​ సోడా:

  • మిక్సీజార్​ను బోర్లా ఉంచి అడుగున ఒకటిన్నర టేబుల్​ స్పూన్​ బేకింగ్​ సోడా వేయాలి.
  • ఆ తర్వాత వెనిగర్​ యాడ్​ చేయాలి. బేకింగ్​ సోడా,వెనిగర్​ను ఓసారి కలిపి రాత్రి మొత్తం అలానే వదిలేయాలి.
  • ఆ మరుసటి రోజు టూత్​బ్రష్​ సాయంతో బాగా రుద్దాలి. ఆ తర్వాత ట్యాప్​ వాటర్​తో క్లీన్​ చేయాలి. తడి లేకుండా పొడి క్లాత్​తో క్లీన్​ చేయాలి.

బేకింగ్​ సోడా, నిమ్మకాయ:

  • ఓ గిన్నెలోకి బేకింగ్​ సోడా తీసుకోవాలి. ఆ సోడాలోకి రెండు నిమ్మకాయల రసాన్ని పిండుకోవాలి.
  • ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలపాలి.
  • స్క్రబ్బర్​ను ఈ నిమ్మకాయ మిశ్రమంలో ముంచి మిక్సీజార్​ అడుగును రుద్దాలి.
  • బాగా స్క్రబ్​ చేసిన తర్వాత నీళ్లతో శుభ్రం చేయాలి. ఆ తర్వాత పొడి క్లాత్​తో తుడిస్తే సరి.
  • అయితే ఒక్కసారికే అడుగు భాగాన ఉన్న మురికి పోదు. కాకపోతే రెండు రోజులకొకసారి ఇలా క్లీన్​ చేయడం వల్ల వాటి మురికి తొలగిపోయి కొత్తవాటిలా కనిపిస్తాయి.

ప్రెషర్​ కుక్కర్​ మాడిందా? - ఈ​ టిప్స్​తో క్లీన్​ చేస్తే మరకలు ఇట్టే మాయం!

సెరామిక్ పాత్రలను ఇలా శుభ్రం చేయండి - ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయట!

కూల్​డ్రింక్ మిగిలితే పారబోస్తున్నారా? - దాని ఉపయోగాలు తెలిస్తే నోరెళ్లబెడతారు!

ABOUT THE AUTHOR

...view details