తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

జాబ్​ ఒత్తిడితో ఉద్యోగిని మృతి - వర్క్​ప్లేస్​లో​ ఇలా చేస్తే.. స్ట్రెస్​ను గెటౌట్ అనొచ్చట! - How To Be Happy at Workplace - HOW TO BE HAPPY AT WORKPLACE

Tips for Happy Workplace: తీవ్ర పని ఒత్తిడి కారణంగా కోచికి చెందిన 26 ఏళ్ల ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై విచారణ జరుపుతామని కేంద్రం కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. వర్క్​ ప్లేస్​ను హ్యాపీగా ఎలా మార్చుకోవాలి? అనే విషయమై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

Tips for Happy Workplace
Tips for Happy Workplace (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2024, 12:13 PM IST

How To Be Happy at Workplace:ఆఫీసుల్లో చాలా మంది ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ ఆఫీసు ఒత్తిడి ఇంట్లోనూ కొనసాగిస్తుంటారు. ఫలితంగా.. దీర్ఘకాలంలో తమకు తెలియకుండానే ఆందోళన, యాంగ్తైటీ వంటి సమస్యల బారిన పడుతుంటారు. తీవ్ర అనారోగ్యాలకు సైతం గురవుతుంటారు. మరి.. దీన్ని అధిగమించేందుకు ఏం చేయాలి అంటే.. వర్క్​ప్లేస్​ను హ్యాపీగా మలుచుకోవడమే అంటున్నారు నిపుణులు. అది కూడా మన చేతుల్లోనే ఉందంటున్నారు! అందుకోసం కొన్ని టిప్స్​ సూచిస్తున్నారు. అవేంటంటే..

ఇలా చేస్తే.. హ్యాపీ వర్క్​ ప్లేస్​:

  • వర్క్​ స్ట్రెస్​ నుంచి విముక్తి పొందాలంటే.. మీరు ఏ పని విషయంలో ఒత్తిడికి గురవుతున్నారో ముందుగా గుర్తించగలగాలి. ఈ క్రమంలో అది మీకు భారంగా, మీ ఆలోచన స్థాయికి మించినట్లుగా అనిపిస్తే నిర్మొహమాటంగా "నో" చెప్పడం మంచిది. లేదంటే ఒత్తిడి తప్పదంటున్నారు నిపుణులు.
  • ఇచ్చిన పని పూర్తవ్వాలని గంటల తరబడి కూర్చోకుండా.. ఇంపార్టెంట్​ అనిపించిన పనులను ముందు పూర్తి చేసుకోవాలి. తద్వారా సమయానికి పనులు పూర్తయ్యేలా చూసుకోవచ్చు.
  • దీనివల్ల మన కోసం మనం కేటాయించుకోవడానికి కాస్త సమయం దొరుకుతుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఇదీ ఓ మార్గమే అంటున్నారు నిపుణులు.
  • నిరంతరాయంగా పనులు చేయడం కాకుండా గంట/రెండు గంటలకోసారి ఓ ఐదు-పది నిమిషాలు విరామం తీసుకోవడం మంచిది.
  • తద్వారా మనసుకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. అలాగే ఈ సమయంలో చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే శారీరకంగానూ అలసిపోకుండా జాగ్రత్తపడవచ్చని సలహా ఇస్తున్నారు.
  • ఎంత పని ఉన్నా.. నిద్ర, ఆహారం విషయాల్లో అస్సలు రాజీ పడకూడదు. ఎందుకంటే ఈ రెండూ కూడా ఒత్తిడిని దూరం చేసి ఆరోగ్యాన్ని చేరువ చేసేందుకు దోహదం చేస్తాయంటున్నారు.
  • పని ప్రదేశంలో అటు కొలీగ్స్‌తో, ఇటు పైఅధికారులతో ఎంత ట్రాన్స్పరెంట్​గా ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు.
  • ఈ క్రమంలో మీకు భారంగా అనిపించిన పనులు, ఇతర విషయాల గురించి నిర్మొహమాటంగా మాట్లాడచ్చని.. దీనివల్లా చాలావరకు ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు.
  • యోగా, ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు.. వంటివి కూడా ఒత్తిడిని చిత్తు చేసే సాధనాలే! కాబట్టి వీటిని రోజూ సాధన చేయడం మంచిదని సూచిస్తున్నారు.

సంస్థలూ ఇలా చేయాలి:ఇలా ఉద్యోగులే కాదు.. సంస్థలూ తమ ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుందంటున్నారు. ఈ క్రమంలో ఉద్యోగులపై అదనపు పని భారాన్ని తగ్గించడంతోపాటు వేళకు పని పూర్తి చేసేలా వాళ్లను ప్రోత్సహించాలి. వారిలోని ఒత్తిడిని దూరం చేసేందుకు సంబంధిత నిపుణులతో ప్రత్యేక సెషన్స్‌ నిర్వహించడం, అప్పుడప్పుడూ వినోద కార్యక్రమాల్ని ఏర్పాటుచేయడం.. వంటివీ వారికి మేలు చేస్తాయంటున్నారు.

ఒత్తిడితో బుర్ర భేజా ఫ్రై అవుతుందా? మీ ఫుడ్​లో ఇవి చేర్చుకుంటే క్షణాల్లో మటుమాయం!

అలర్ట్​ - ఈ ఫుడ్స్​కు దూరంగా ఉండకపోతే - మీ స్ట్రెస్ లెవల్స్ మరింత పెరుగుతాయి!

ABOUT THE AUTHOR

...view details