తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

సంక్రాంతి స్పెషల్​ - మీ బంధువులకు ఇలా విషెస్​ తెలపండి - సంబరపడతారు! - SANKRANTI 2025 SPECIAL WISHES

సంబరాలు పంచే సరదాల సంక్రాంతి - మీ ప్రియమైన వారికోసం "ఈటీవీ భారత్" స్పెషల్ విషెస్!

Sankranti 2025 Special Wishes
Makar Sankranti 2025 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2025, 1:24 PM IST

Makar Sankranti 2025 Special Wishes in Telugu : తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి సంబరం షురూ అయింది. ఈ క్రమంలోనే పల్లెలన్నీ కొత్త శోభను సంతరించుకున్నాయి. పంట చేతి కొచ్చే సమయంలో, ఆనందోత్సవాల నడుమ పిల్లల నుంచి పెద్దల వరకు ఈ పండగను మూడు రోజులపాటు ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది తమ ఆత్మీయులు, బంధుమిత్రులకు విషెస్ తెలియజేస్తుంటారు. అయితే, ఎప్పుడూ ఒక్కమాటలో జస్ట్ "సంక్రాంతిశుభాకాంక్షలు" అని కాకుండా ఈసారి సరికొత్తగా ట్రై చేయండి. అందుకే మీకోసం "ఈటీవీ భారత్" కొన్ని స్పెషల్ గ్రీటింగ్స్, కోట్స్ తీసుకొచ్చింది. వాటిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

  • "ముగ్గుల్లోని రంగుల అందం, పండగ నాడు మీ ఇంట్లో వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ" - అందరికీ హ్యాపీ సంక్రాంతి 2025!
  • "ప్రకాశించే సూర్యుడు మీ జీవితంలో సరికొత్త కాంతులు తీసుకురావాలని వేడుకుంటూ" - మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!
  • "ఆ పతంగుల వలె మీ లైఫ్ కలర్​ఫుల్​గా మారి, అంతులేని తీరాలను చేరుకోవాలని కోరుకుంటూ" - హ్యాపీ పొంగల్ 2025!
  • "పాలలోని తెల్లదనం,చెరుకులోని తియ్యదనం, గాలిపటంలోని రంగుల అందం మీ ఇంట వెల్లివిరియాలని వేడుకుంటూ"- అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు!
  • "నూతన సంవత్సరంలో వచ్చిన ఈ పండగమీకు అంతులేని అవకాశాలను అందించాలని కోరుకుంటూ"- అందరికీ హ్యాపీ పొంగల్ 2025!!
  • "ఈ మకర సంక్రాంతి మీకు మధుర క్షణాలు అందించాలని, ఫ్యామిలీ, ఫ్రెండ్స్​తో మరపురాని జ్ఞాపకాలు పొందాలని కోరుకుంటూ" - హ్యాపీ సంక్రాంతి!
  • "ఉదయించే సూర్యునితో మీ లైఫ్​లోని మంచి క్షణాలు, విజయాలు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ" - అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 2025!
  • "ఈ సంక్రాంతి మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని మనసారా ఆకాంక్షిస్తూ"- హ్యాపీ పొంగల్ 2025!
  • "2025లో వచ్చిన ఈ భోగి మీకు భోగభాగ్యాలు అందించాలని, సంక్రాంతి సందడి తీసుకురావాలని, కనుమ మధురమైన జ్ఞాపకాలు అందించాలని మనసారా వేడుకుంటూ" - మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!!

సంక్రాంతి సెలవుల్లో ఊరికి పోవట్లేదా? - అయితే హాలీడేని ఇలా ప్లాన్​ చేసుకోండి!

Sankranti 2025 Special Quotes in Telugu :

"భోగ భాగ్యాలనిచ్చే - భోగి

సరదాలనిచ్చే - సంక్రాంతి

కమ్మని - కనుమ

మీ జీవితంలో కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ"

- అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!

"ఇంటి ముందు కళకళలాడే రంగురంగుల ముగ్గులు

మనకే సొంతమైన ఆచారాలు, బసవన్నల ఆటపాటలు

చిన్నపిల్లల బోసినవ్వులతో ఈ పండగ ఆనందమయం కావాలని ఆకాంక్షిస్తూ"

- బంధుమిత్రులందరికీ హ్యాపీ సంక్రాంతి 2025!!

"తెలుగుదనాన్ని చాటుతూ

సంప్రదాయాల్ని తెలుపుతూ

సంక్రాంతి సంబరాన్ని జరుపుకో

తెలుగు వారసత్వాన్ని నిలుపుకో"

- హ్యాపీ పొంగల్ 2025!

''గుర్తొచ్చాయా చిన్ననాటి సంగతులు

వణికే చలిలో భోగి మంటలు

కొత్త బట్టల కోసం ఎన్నో అలకలు

మదిలో మెదిలో మధుర స్మృతులు"

- అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు 2025!!

ఇవీ చదవండి :

"సంక్రాంతి రోజు ఇలా పూజ చేస్తే - ఏడాది మొత్తం సకల శుభాలు కలుగుతాయి!"

పిల్లలకు భోగి పళ్లు పోస్తున్నారా? - ఈ పద్ధతి పాటిస్తేనే విష్ణుమూర్తి అనుగ్రహం!

ABOUT THE AUTHOR

...view details