How To Improve Good Cholesterol :అన్ని విషయాల్లో మంచి, చెడు ఉన్నట్లే.. కొవ్వుల్లోనూ ఆరోగ్యానికి మేలు చేసేవి, హాని కలిగించేవి రెండూ ఉంటాయి. చెడు కొవ్వులను.. LDL కొలెస్ట్రాల్ అని, మంచి కొవ్వులను.. HDL కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి. మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. అప్పుడే గుండె ఆరోగ్యం బాగుంటుందంటున్నారు నిపుణులు. కానీ.. మారిన జీవనశైలి కారణంగా నేటి రోజుల్లో చాలా మందిలో మంచి కొలెస్ట్రాల్ కంటే.. చెడు కొలెస్ట్రాల్(LDL Cholesterol) స్థాయిలే ఎక్కువగా ఉంటున్నాయి. ఫలితంగా గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యల ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి, రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుకోవాలంటే రోజువారి డైట్లో కొన్ని ఆహారాలను తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ అంజలీ దేవి. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఓట్స్ :ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో చాలా బాగా సహాయపడతాయని చెబుతున్నారు. అందుకే.. వైద్యులూ రోజూ ఏదో ఒక రూపంలో ఓట్స్‌ను తీసుకునే వారిలో HDL కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుందని చెబుతుంటారు. కాబట్టి, ఓట్స్‌ను డైలీ డైట్లో తప్పక ఉండేలా చూసుకోవాలంటున్నారు.
ఆలివ్ నూనె :రోజువారి వంటలలో సాధారణ వంట నూనెల కంటే ఆలివ్ నూనె యూజ్ చేయడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంటున్నారు. మరి ముఖ్యంగా ఆలివ్ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు చాలా బాగా తోడ్పడతాయని సూచిస్తున్నారు.
గింజ ధాన్యాలు : పల్లీలు, ఆల్మండ్స్, ఆవకాడో వంటి వాటిలో అసంతృప్త కొవ్వుల శాతం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి.. వీటినీ తరచుగా తీసుకోవడం ద్వారా రక్తంలో మంచి కొలెస్ట్రాల్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్ అంజలీ దేవి.
అలర్ట్ ఎవ్రీవన్ : మారిపోయిన కొలెస్ట్రాల్ లెక్కలు - తొలిసారి CSI మార్గదర్శకాలు - అంతకు మించితే అంతే!