Financial Assistance for Food Processing Industries :మీరు సొంతంగా ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ? బాగా కష్టపడి గొప్ప పారిశ్రామికవేత్తగా మారాలనుకుంటున్నారా ? అయితే, ఈ స్టోరీ మీ కోసమే! మీ దగ్గర మంచిబిజినెస్ఐడియా, యూనిట్ పెట్టుకోవడానికి 10% పెట్టుబడి ఉంటే చాలు. ఇక మీరు వ్యాపారంలో రాణించేందుకు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహారశుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం(పీఎంఎఫ్‌ఎంఈ) సువర్ణ అవకాశం కల్పిస్తోంది. ఈ స్కీమ్ కింద 35% రాయితీ (గరిష్ఠంగా రూ.10లక్షల వరకు) ఇస్తుంది. అలాగే బ్యాంక్ లోన్ కూడా పొందవచ్చు. ఈ స్కీమ్‌కు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
కొంతమందికి కూరలు చేయడం, పచ్చళ్లు పెట్టడం, కారం పొడి చేయడం, ఒడియాలు పెట్టడంలో ప్రావీణ్యం ఉండొచ్చు. అలాగే మరికొందరికి మినీ దాల్‌మిల్ పెట్టాలనే ఆసక్తి ఉండొచ్చు. కొందరు ఆక్వా ఆధారిత ఉత్పత్తులు, పప్పులు చేద్దామనీ అనుకోవచ్చు. ఇలాంటి వారందరికీ పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద లోన్లు అందిస్తారు.
యూనిట్ ఏదైనా దానికయ్యే ఖర్చులో సొంత వాటాగా 10 శాతం మీరు పెట్టుబడి పెడితే సరిపోతుంది. ప్రభుత్వం 35 శాతం రాయితీ ఇచ్చి బ్యాంకు లోన్ 55 శాతం అందేలా చేస్తుంది. తద్వారా మీరు ఓ పారిశ్రామికవేత్తగా మారి మీ చుట్టూ ఉండే పదిమందికి ఉపాధి కల్పించవచ్చు. ఉత్పత్తుల క్యాలిటీ ఆధారంగా మార్కెట్‌లో ఒక బ్రాండ్ సృష్టించుకునే అవకాశమూ ఉంది. ఇప్పటికే యూనిట్లు ఉన్నా లోన్ తీసుకొని విస్తరించుకోవచ్చు.
యూనిట్ వ్యయం: రూ. 5 లక్షలు లోపు
ఈ వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు : పిండి మరలు, వెజ్, నాన్‌వెజ్ పచ్చళ్లు, మిరప, పసుపు, మసాలా పొడులు, పూతరేకులు, కొబ్బరిపొడి, కొబ్బరి బర్ఫి, రొట్టెలు, అరటి చిప్స్, కేక్స్, ఇడ్లీ, దోశ పిండి తయారీ, ప్యాకింగ్. ఒడియాలు, అప్పడాలు, వేరుసెనగ చక్క, ఫ్లేవర్డ్ మిల్క్, సోలార్ డీహైడ్రేషన్ యూనిట్లు సహా ఎలాంటివైనా పెట్టుకోవచ్చు.
యూనిట్ వ్యయం: రూ.5 లక్షలు - రూ.10లక్షలు
ఈ వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు : వంటనూనెలు, నూడుల్స్, చాక్లెట్లు, ఛీజ్, పన్నీర్, సేమియా, చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తులు, జెల్లీ, పండ్ల జామ్, చపాతీ, పరోటా, అరటి పొడి, పశువుల దాణా తయారీ, మిల్లెట్ ఫ్లేక్స్, డీహైడ్రేటెడ్ ఫ్రూట్ పౌడర్, అల్లం-వెల్లుల్లి పేస్టు, నన్నారి, పానిపూరీ తయారీ.
యూనిట్ వ్యయం: రూ.10లక్షల నుంచి రూ.20లక్షలు
ఈ వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు : మినీ ధాన్యం, పప్పు మిల్లులు, సాస్, జెల్లీ, కెచప్, తేనె శుద్ధి, ప్యాకింగ్, నూనెల తయారీ, ఇన్‌స్టెంట్ ప్రీమిక్స్(గులాబ్‌జాం, ఖీర్, కేక్ మిక్స్‌లు), చిరుధాన్యాల ఆధారిత ప్రాథమిక ఆహారశుద్ధి యూనిట్లు, కొబ్బరిపాలు తయారీ మొదలైనవి.
యూనిట్ వ్యయం: రూ.20లక్షల నుంచి రూ.35లక్షలు