తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

అదుర్స్ అనిపించే "రాయలసీమ స్పెషల్ ఎగ్ కారం దోశ" - సింపుల్​గా ప్రిపేర్ చేసుకోండిలా!

మీరు ఇప్పటివరకు ట్రై చేయని దోశ రెసిపీ - ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే టేస్ట్ అద్దిరిపోతుంది!

How to Make Egg Karam Dosa
Rayalaseema Egg Karam Dosa (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2024, 1:24 PM IST

How to Make Rayalaseema Egg Karam Dosa :చాలా మంది మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్ ఫెవరేట్ రెసిపీ దోశ. అందులోనూ ఎగ్ దోశఅంటే మరింత ఇష్టంగా తింటుంటారు. అయితే, ఈ ఎగ్​ దోశను ఎప్పుడూ ఒకేలా తిన్నా బోరింగ్​ ఫీల్ వస్తుంది. అందుకే, ఈసారి కాస్త వెరైటీగా "రాయలసీమ స్పెషల్ ఎగ్ కారం దోశ"ను ట్రై చేయండి. దీన్ని ఎవరైనా ఒక్కసారి టేస్ట్ చేశారంటే వారెవ్వా ఏం టేస్ట్ గురూ అని పొగడక మానరు. అంత రుచికరంగా ఉంటుంది ఈ దోశ! మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • మినపపప్పు - 1 కప్పు
  • బియ్యం - రెండున్నర కప్పులు
  • అటుకులు - అరకప్పు
  • మెంతులు - 1 టీస్పూన్
  • ఉప్పు - కొద్దిగా
  • ఎగ్స్ - ఒక్కో దోశకు ఒకటి చొప్పున
  • ఆయిల్ - తగినంత

ఎండుకారం కోసం :

  • ఎండుమిర్చి - 100 గ్రాములు
  • చింతపండు - నిమ్మకాయ సైజంత
  • వెల్లుల్లి రెబ్బలు - 15 నుంచి 20
  • రాళ్ల ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - 75ఎంఎల్
  • ఆవాలు - అరటీస్పూన్
  • కరివేపాకు - 2 రెమ్మలు

నోట్లో వేస్తే కరిగిపోయే "స్పాంజ్ దోశ"- సింపుల్​గా ఇలా ప్రిపేర్ చేసుకోండి- టేస్ట్ మామూలుగా ఉండదు!

తయారీ విధానం :

  • ముందుగా మినపపప్పు, బియ్యం, అటుకులు, మెంతులుఅన్నింటిని ఒకసారి శుభ్రంగా కడిగి, వేర్వేరు బౌల్స్​లో విడివిడిగా 4 గంటలపాటు నానబెట్టుకోవాలి.
  • ఆ తర్వాత వాటన్నింటిని వాటర్ వడకట్టుకొని మిక్సీ జార్​లోకి తీసుకొని తగినన్ని నీళ్లు యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై ఆ పిండిని కనీసం 12 గంటలపాటు పులియబెట్టుకోవాలి.
  • అనంతరం పులియబెట్టుకున్న పిండిని తీసుకొని ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు రెసిపీలోకి కావాల్సిన ఎండుకారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పుతో పాటు కాసిన్ని వాటర్ పోసుకొని మిరపగింజలూ మెదిగేలా మెత్తని పేస్ట్​లాగా మిక్సీ పట్టుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక ఆవాలు, కరివేపాకు వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఆపై మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్​ని అందులో వేసి మీడియం ఫ్లేమ్​ మీద కలుపుతూ నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి.
  • ఇందుకోసం కనీసం 15 నిమిషాల టైమ్ పట్టొచ్చు. ఆవిధంగా వేయించుకున్నాక దాన్ని ఒక గాలి చొరబడని గ్లాసు జార్​లోకి తీసుకొని స్టోర్ చేసుకున్నారంటే నెల పాటు ఫ్రెష్​గా ఉంటుంది!
  • ఇప్పుడు ఎగ్ దోశ కోసం.. స్టౌపై దోశ పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత మంటను తగ్గించి పెద్ద గరిటెడు పిండిని తీసుకొని దోశ మాదిరిగా వేసుకోవాలి.
  • ఆపై అట్టు అంచుల వెంబడి కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. దోశపైన పిండి మగ్గి అట్టు మధ్యన ఎర్రగా మారిన టైమ్​లో.. మధ్యలో మీరు ప్రిపేర్ చేసుకున్న ఎండుకారాన్ని ఒక టేబుల్​స్పూన్ వేసుకొని దాని మీద ఒక గుడ్డునిబ్రేక్ చేసి నెమ్మదిగా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి.
  • అయితే, దోశ మీద ఎగ్ స్ప్రెడ్ చేస్తున్న టైమ్​లో మంట మీడియం ఫ్లేమ్​లోనే ఉండాలి. లేదంటే అడుగున మాడిపోయి సరైన టేస్ట్ రాదనే విషయం గుర్తుంచుకోవాలి.
  • ఎండుకారం పేస్ట్​, ఎగ్​ని దోశ మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాక దానిపై మరికొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక నిమిషం పాటు కాల్చుకొని మరోవైపుకి టర్న్ చేసుకొని 30 నుంచి 40 సెకన్ల పాటు కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ ఎగ్ కారం దోశ" రెడీ!

బియ్యం పిండి దోశలతో షుగర్ సమస్యా? - ఇలా "రాగి దోశలు" చేసుకోండి! - సూపర్ టేస్టీ, ఇంకా ఆరోగ్యం

ABOUT THE AUTHOR

...view details