ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

పాతకాలపు 'ఉప్మా' తయారీ విధానం - ఇలా చేస్తే మీకు 100 మార్కులు గ్యారెంటీ! - INSTANT UPMA RECIPE TELUGU

ఉప్మా కదా అని వదిలేయకండి - ఇలా చేస్తే రుచి వేరే, అస్సలు వదలరు

instant_upma_recipe_telugu
instant_upma_recipe_telugu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2025, 3:19 PM IST

Instant Upma Recipe Telugu :ఉప్మా తినీ తినీ బోర్ కొడుతోందా? రుచి కోసం నూనెలు మారుస్తున్నారా? అదనపు హంగు కోసం కూరగాయ ముక్కలు, తాళింపు గింజలు వేస్తున్నారా? ఎంత చేసినా గిన్నె కాళీ కావడం లేదా?ఇంట్లో వాళ్లు మిమ్మల్ని మెచ్చుకోవడం లేదా? అయితే పాత తరం వాళ్లు తయారు చేసిన స్టైల్​లో ఉప్మా చేసి పెట్టండి గిన్నె ఖాళీ కావడంతో పాటు మీకు ప్రశంసలు దొరుకుతాయి.

అసలు ఉప్మా దక్షిణ భారతదేశంలో ఫేమస్ వంటకం. కేవలం ఉదయం అల్పాహారంగానే కాకుండా మధ్యాహ్నం లంచ్ బాక్స్​లోకి కూడా ఉప్మా ఫేవరెట్ ఐటమ్. దాదాపు ప్రతీ ఇంట్లో వారంలో రెండు రోజులైనా ఉప్మా చేస్తుంటారు. ఇంటికి బంధువులు వచ్చినా, ఏవైనా ఫంక్షన్లు ఉన్నా ఉప్మా చేస్తే చాలు అందరికీ సరిపెట్టొచ్చు అనేలా ఉంటుంది. తయారీ విధానం సులభంగా ఉండడంతో పాటు ఖర్చు తక్కువ అనే ఉద్దేశంతో ఉప్మా అందరికీ చీప్ గా కనిపిస్తోంది. కానీ, పాత తరం వాళ్లు చేసిన స్టైల్​లో చిన్న చిన్న టిప్స్ పాటించి తయారు చేస్తే సరి. రుచిగా రావడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.

'దహీ ఇడ్లీ' సింపుల్ టిప్స్​తో ఇలా ట్రై చేయండి - ఒక్కటి కూడా వదలరు

చిట్కాలు

  • ఉప్మా రవ్వలో జీలకర్ర కలుపుకొని సన్నని సెగ మీద వేపుకోవాలి. వేడికి జీలకర్ర రవ్వకి పట్టి ఉప్మా సువాసనతో రుచిగా ఉంటుంది.
  • గ్లాసు ఉప్మా రవ్వ తీసుకుంటే మూడు గ్లాసుల నీళ్లు, ఒక గ్లాసు పాలు తీసుకోవాలి. ఒకవేళ మీరు రెండు గ్లాసుల రవ్వ తీసుకుంటే ఆరు గ్లాసుల నీళ్లు, రెండు గ్లాసుల పాలు అవసరం. రవ్వ, నీళ్లు, పాలు 1:3:1 నిష్పత్తిలో ఉండాలని గుర్తు పెట్టుకుంటే చాలు.
  • ఇలా కొలతల ప్రకారం చేస్తే ఉప్మాకి కమ్మదనంతో పాటు కొత్త రుచి వస్తుంది.
  • మరుగుతున్న ఎసరులో ఉప్పు వేస్తే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే వేపిన రవ్వలోనే ఉప్పు కలుపుకొంటే సరిపోతుంది.
  • శెనగపప్పు, మినపప్పు కాస్త దట్టించారంటే వేపుడు వల్ల ఎర్రగా కరకరలాడుతూ పంటికి రుచిగా తగులుతాయి.
  • మీకు ఇష్టం ఉంటే ఉల్లిపాయతో పాటు, జీడిపప్పు, పల్లీలు కూడా వేసుకోవచ్చు.
  • ఎక్కువగా ఉడికిస్తే ఉప్మా గట్టిగా మారుతుంది. అందుకే ముందుగానే దించుకోవాలి.

రుచికరమైన హెల్తీ సొరకాయ దోశ - ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది!

కావాల్సిన పదార్థాలు :

  • ఉప్మా రవ్వ - 1 కప్పు
  • జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
  • నూనె - 3 టేబుల్ స్పూన్
  • ఆవాలు - టేబుల్ స్పూన్
  • పచ్చి శెనగపప్పు - 2 టేబుల్ స్పూన్
  • మినపప్పు - 2 టేబుల్ స్పూన్
  • కరివేపాకు - 2 రెబ్బలు
  • అల్లం - టేబుల్ స్పూన్
  • జీడిపప్పు పలుకులు - 10-15
  • పచ్చిమిర్చి (సన్నని తరుగు) - 2
  • నెయ్యి - పావు కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పాలు - 1 కప్పు
  • నీళ్లు - 3 కప్పులు

ఎన్ని వెరైటీలున్నా కరివేపాకు చికెన్ క్రేజ్ వేరే! - సింపుల్ టిప్స్​తో సూపర్ టేస్ట్

తయారీ విధానం

  • మందపాటి మూకుడు తీసుకుని రవ్వ పోసుకోవాలి. అందులోనే టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి. సన్నని సెగ మీద రవ్వ సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి. రవ్వ సువాసన రావడానికి కనీసం 10 నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉంది.
  • రవ్వ వేడి చేసుకున్న మూకుడులో నూనె పోసుకుని చేసి పోపు గింజలు వేసుకోవాలి. అందులోనే ఆవాలు, శెనగపప్పు, మినపప్పు వేసి ఎర్రగా వేగాక కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి కొద్ది సేపు వేగనివ్వాలి.
  • ఇప్పుడు అదే తాలింపులో మూడు కప్పుల నీళ్లు, కప్పు పాలు పోసి హై-ఫ్లేమ్ మీద మరగనివ్వాలి.
  • వేపుకున్న రవ్వలో ఉప్పు కూడా కలుపుకొని మరుగుతున్న ఎసరులో పోసుకోవాలి. అదే సమయంలో రవ్వ ఉండలు కట్టకుండా కలుపుతూ పోసుకోవాలి.
  • 5 నిమిషాలు పాటు మరిగితే చాలు. అంతకు మించి పొయ్యి మీద ఉంచితే రవ్వ గట్టిపడే అవకాశాలున్నాయి. పైన నెయ్యి పోసుకుని కలిపి దించుకోవడమే. అద్భుతమైన రవ్వ ఉప్మా సిద్ధమైనట్టే!

అమ్మో! 'స్ట్రాంగ్ టీ' అంత పని చేస్తుందా? - చాయ్ ప్రియులూ పారా హుషార్!

మీరు ఏ స్టైల్లో వండుతున్నారు - తేడా వస్తే అనారోగ్యం పొంచి ఉందట!

ABOUT THE AUTHOR

...view details