ETV Bharat / offbeat

'యాపిల్ వెనిగర్' ఇంట్లో ఉంటే చాలు! - ఊహించని ప్రయోజనాలు అనేకం - APPLE CIDER VINEGAR USES

పెరుగుతున్న యాపిల్ వెనిగర్ వినియోగం - కిచెన్​లో ఇలా ఉపయోగించుకోవాలని నిపుణులు సూచన!

APPLE CIDER VINEGAR USES
APPLE CIDER VINEGAR USES (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 5, 2025, 5:12 PM IST

Benefits of Apple Cider Vinegar : ఇంటిని శుభ్రం చేయడం దగ్గరి నుంచి వంటలకు మంచి రుచి తీసుకురావడం దాకా ఎన్నో అవసరాల కోసం చాలా మంది యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను ఉపయోగిస్తున్నారు. అలాగే పండ్లు, కూరగాయలను కడిగేందుకు, ముఖానికి టోనర్​గా, జుట్టును శుభ్రం చేయడానికి, చుండ్రును తొలగించుకునేందుకు, మౌత్ వాష్​గా ఇలా అనేక రకాలుగానూ వినియోగిస్తున్నారు. అయితే, వీటితో పాటు యాపిల్ సైడర్ వెనిగర్​ని మరెన్నో గృహావసరాలను తీర్చేందుకు సైతం ఉపయోగించవచ్చంటున్నారు నిపుణులు. ఆ టిప్స్​ ఏంటో మీకు తెలుసా ?

చేతులు స్మెల్​ రాకుండా!

చేపలు, మాంసం శుభ్రం చేసిన అనంతరం, అలాగే ఉల్లిపాయలు కట్​ చేసిన తర్వాత ఆ వాసన చేతుల నుంచి అంత త్వరగా పోదు. సోప్​తో చేతులు కడిగినప్పటికీ ప్రయోజనం ఉండదు. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ ద్వారా ఈ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు. ముందుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. తర్వాత కొద్దిగా ఈ వెనిగర్‌ను నీటిలో కలిపి దానితో చేతులు కడుక్కోవాలి. ఆపై గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చేతుల నుంచి ఎలాంటి స్మెల్​ రాదు.

కళ్లద్దాలపై మరకలు మాయం!

రోజూ కళ్లద్దాలు వాడే క్రమంలో మరకలు ఏర్పడడం సహజం. ఇలా ఏర్పడిన మరకలను తొలగించాలంటే కష్టమే. ఎందుకంటే కాస్త గట్టిగా తుడిస్తే అద్దంపై గీతలు పడే అవకాశాలున్నాయి. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు కళ్లద్దాలపై కాస్త యాపిల్ సైడర్ వెనిగర్‌ను స్ప్రే చేసి మెత్తటి వస్త్రంతో తుడిస్తే మరక మాయమవుతుంది.

కుండీల్లోని కలుపు :

పెరటి తోట, కుండీల్లో వచ్చే కలుపును యాపిల్ సైడర్ వెనిగర్ సాయంతో నాశనం చేయచ్చు. దీనికోసం ముప్పావు కప్పు యాపిల్ సైడర్ వెనిగర్‌లో పావు కప్పు వాటర్​ని కలిపి స్ప్రేబాటిల్‌లో పోయాలి. ఈ మిశ్రమాన్ని కలుపు మొక్కలపై స్ప్రే చేయడం ద్వారా వాటిని నాశనం చేయచ్చు.

'వయసు 36 ఏళ్లు - ఇప్పుడు రెండో బిడ్డ కోసం ప్రయత్నించవచ్చా?'

పాలడబ్బాలు, పాలపీకలను :

చిన్నారుల పాలడబ్బాలు, పాలపీకలను ఎప్పటికప్పుడు క్లీన్​ చేయకపోతే వారు అనారోగ్యానికి గురయ్యే ఛాన్స్​ ఉంది. వీటిని వెనిగర్‌తో క్లీన్​ చేయడం ద్వారా బ్యాక్టీరియా పెరగకుండా కాపాడుకోవచ్చు. ఇందుకోసం వేడినీటిలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ని కలిపి ఆ మిశ్రమంతో రోజుకోసారి పాలడబ్బాలు, పాలపీకలను కడగాలి. ఆపై మరోసారి వేడినీటితో వీటిని శుభ్రం చేయాలి. ఇలా చేస్తే డబ్బా వెనిగర్ వాసన రాకుండా ఉంటుంది.

కొవ్వొత్తుల మరకలు :

కొన్ని సందర్భాల్లో కొవ్వొత్తుల కారణంగా ఫ్లోర్, చెక్క వస్తువులపై మరకలు ఏర్పడుతుంటాయి. వాటిని యాపిల్ సైడర్ వెనిగర్ ద్వారా ఈజీగా పోగొట్టవచ్చు. ఇందుకోసం సమాన పాళ్లలో యాపిల్ సైడర్ వెనిగర్, నీటిని తీసుకొని కలిపి అందులో వస్త్రాన్ని ముంచి మరక ఏర్పడిన చోట రుద్దితే సరిపోతుంది!

వంట పాత్రలపై అతికించిన స్టిక్కర్లు :

కొత్తగా కొన్న వంట పాత్రలపై అతికించిన స్టిక్కర్లు, బార్‌కోడ్‌లను తొలగించడం కొద్దిగా కష్టమే. అయితే యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను ఉపయోగించి వాటిని ఈజీగా తొలగించవచ్చు. ఇందుకోసం స్ప్రే బాటిల్‌లో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్ యాడ్​ చేసి దాన్ని స్టిక్కర్లపై స్ప్రే చేయాలి. అనంతరం చేత్తో రుద్దితే అవి సులువుగా పోతాయి.

వంట పాత్రలు:

కొన్నిసార్లు ఆహారపదార్థాలు మాడిపోయినప్పుడు పాత్రలు నల్లగా తయారవుతాయి. అయితే, యాపిల్ సైడర్ వెనిగర్‌ ఉపయోగించి మరకలు సులభంగా వదిలించవచ్చు. ఇందుకోసం మాడిపోయిన పాత్రలో కప్పు నీరు, కప్పు యాపిల్ సైడర్ వెనిగర్ పోసి స్టౌపై ఉంచి బాగా వేడి చేయాలి. స్టవ్​ ఆఫ్ చేసిన తర్వాత రెండు స్పూన్ల బేకింగ్ సోడాను కలిపితే నురగ మాదిరిగా వస్తుంది. అది రావడం ఆగిపోయిన అనంతరం పాత్రలోని మిశ్రమాన్ని ఒంపి నీటితో శుభ్రం చేయాలి. తర్వాత పేపర్ టవల్‌తో తుడిస్తే సరిపోతుంది.

అలర్ట్‌ : రోజూ యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ తీసుకుంటున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

మీ 'పప్పీ'ని వదల్లేకున్నారా? - మీతో పాటే ట్రైన్​లో తీసుకెళ్లొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.