తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

నోరూరించే 'వంకాయ టమాట పచ్చడి' - ఇలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్​ అదుర్స్​! - Brinjal Tomato Chutney - BRINJAL TOMATO CHUTNEY

Brinjal Tomato Chutney Recipe: మీరు వంకాయతో ఇప్పటివరకు ఎన్నో రకాల వంటలు చేసుకునే ఉంటారు. అయితే, ఎప్పుడూ చేసుకునేవే కాకుండా ఈసారి సరికొత్తగా వంకాయ టమాట పచ్చడి ట్రై చేయండి. రుచి అద్దిరిపోతుంది! పైగా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

Vankaya Tomato Pachadi
Brinjal Tomato Chutney (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 1:50 PM IST

How To Make Vankaya Tomato Pachadi :చాలా మందికి పచ్చడి అనగానే టమాటా, ఆవకాయ, ఉసిరికాయ, దొండకాయ వంటివే ఎక్కువగా గుర్తుకువస్తుంటాయి. అలాగే కొన్నిసార్లు నాన్​వెజ్ పచ్చళ్లు ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, ఎప్పుడూ ఒకే రకం పచ్చళ్లు కాకుండా.. ఈసారి కొత్తగా వంకాయ టమాటా పచ్చడిని ట్రై చేయండి. దీన్ని ఒక్కసారి ఇంట్లో ట్రై చేశారంటే.. మళ్లీ మళ్లీ చేసుకోవడం పక్కా. ఎందుకంటే.. చాలా తక్కువ సమయంలోనే ఘుమఘుమలాడే పచ్చడి రెడీ అయిపోతుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం నోరూరించే.. టేస్టీ వంకాయ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్ధాలు :

మెంతి కారం కోసం :

  • నూనె - ఒకటిన్నర టేబుల్​స్పూన్లు
  • ఆవాలు - 1 టీస్పూన్
  • మెంతులు - అర టీస్పూన్
  • శనగపప్పు - 1 టీస్పూన్
  • మినపప్పు - 1 టీస్పూన్
  • ఎండుమిర్చి - 7 నుంచి 8
  • పచ్చిమిర్చి - 5

చట్నీ కోసం :

  • లేత వంకాయలు - 300గ్రాములు
  • టమాటా - 150 గ్రాములు(పండినవి)
  • చింతపండు రసం - రెండున్నర టేబుల్​స్పూన్లు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - 3 టేబుల్​స్పూన్లు

తాలింపు కోసం :

  • నూనె - ఒకటిన్నర టేబుల్​స్పూన్లు
  • జీలకర్ర - అర టీస్పూన్
  • ఇంగువ - కొద్దిగా
  • ఎండుమిర్చి - 2
  • కరివేపాకు రెమ్మలు - 2

మిర్చి, ఎగ్​ బజ్జీలు తిని బోర్ కొడుతోందా? - వేడివేడి వంకాయ బజ్జీ ట్రై చేయండి!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన వంకాయలను(Brinjal)రౌండ్ షేప్​లో చిన్న సైజ్​లో కట్ చేసుకోవాలి. అయితే, ఇక్కడ గుత్తి వంకాయలు కాకుండా లేత పొడవు నీలం రంగు వంకాయలను తీసుకోవాలి. ఇవి పచ్చడికి రుచిగా ఉంటాయి.
  • అలాగే.. టమాటా, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీరను తరిగి పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు మెంతికారం కోసం.. స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక మెంతులు, ఆవాలు వేసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి మెంతులు ఎర్రగా వేగే వరకు రోస్ట్ చేసుకోవాలి. అదే.. మెంతులు సరిగా వేగకపోతే చేదుగా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • ఆ తర్వాత అందులో మినపప్పు, శనగపప్పు వేసుకొని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే, పప్పులు చెంచా కంటే ఎక్కువగా వేయకండి. ఎందుకంటే.. రుచి మారుతుంది.
  • ఆవిధంగా వేయించుకున్నాక.. ఆ మిశ్రమంలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. అంటే.. ఎండుమిర్చి పొంగి రంగు మారితే చాలు.
  • అనంతరం స్టౌ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని కాస్త చల్లారనిచ్చి ఆపై మిక్సీలో వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు పచ్చడికోసం స్టౌపై మళ్లీ అదే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త వేడెక్కాక.. వంకాయ ముక్కలు వేసి కలిపి మూతపెట్టి అవి మెత్తబడే వరకు మగ్గించుకోవాలి.
  • వంకాయలు మగ్గిన తర్వాత.. ఆ మిశ్రమంలో టమాటా ముక్కలు వేసి కలిపి మరికాసేపు మగ్గబెట్టుకోవాలి. అంటే.. టమాటా ముక్కలు మరీ మెత్తగా కాకుండా వాటిపై స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది.
  • ఆవిధంగా మగ్గాక.. అందులో చింతపండు పులుసు, కొద్దిగా పసుపు, పిడికెడు కొత్తిమీర తరుగు వేసి బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గించుకోవాలి.
  • ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మెంతికారాన్ని ఆ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్​లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ వేయకుండా రెండు, మూడు సార్లు పల్స్ చేసుకోవాలి. అంతేకానీ.. మెత్తగా గ్రైండ్ చేయకూడదు.
  • ఇప్పుడు తాలింపు కోసం.. స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది హీట్ అయ్యాక ఇంగువ, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
  • ఆపై దాన్ని పచ్చడి మిశ్రమంలో వేసి కలుపుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే ఘుమఘుమలాడే కమ్మటి 'వంకాయ టమాటా పచ్చడి' రెడీ!

నోరూరించే "వంకాయ దమ్​ బిర్యానీ" - ఇలా చేశారంటే ఇంట్లో ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details