Brain Dead Woman Organs Donation in Anakapalli Dist : కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం. ఈ రెండింటి మధ్యే మనిషి జీవితం అని వింటూనే ఉంటాం. పుట్టడం, గిట్టడం ఏ ఒక్కరి చేతిలో ఉండేవి కావు. కానీ మరణశయ్యపై ఉంటూ మరో నలుగురికి అవయవాలను ప్రసాదించడం ఒక గొప్ప కార్యంగా చెప్పవచ్చు. మట్టిలో కలిసే అవయవాలు మరో మనిషి శరీరంలోకి వెళ్లి అవి నిత్య చేతనంగా నిలుస్తాయి. ఇది గ్రహించిన కొందరు తమవారు మరణించినా పరుల మేలు ఆలోచించి పునర్జన్మను ప్రసాదిస్తున్నారు.
Organ Donation in Anakapalli District :తాజాగా పుట్టెడు దుఃఖంలోనూ ఉన్న ఓ కుటుంబం ఏడుగురి జీవితాల్లో వెలుగులు నింపడానికి ముందుకు వచ్చింది. పేదలైనా అక్షర జ్ఞానం లేకపోయినా పెద్ద మనసు చేసుకొని అవయవదానానికి అంగీకరించింది. కనుచూపు మేరలో కన్నతల్లి కనిపించదని తెలిసినా ఇతరుల నీడలో ఓదార్పు పొందడానికి సిద్ధమయ్యారు. కష్టకాలంలో గొప్ప మనసు చాటుకున్న సంఘటన అనకాపల్లిలో జిల్లాలో జరిగింది.
స్పూర్తిగా నిలిచిన కుటుంబ సభ్యులు :అనకాపల్లి జిల్లాఅచ్యుతాపురం మండలంలోని పూడిమడకకు చెందిన ఓ మత్స్యకార మహిళ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అంత కష్టంలోనే కుటుంబ సభ్యులు బాధను దిగమింగుకొని వారు అవయవదానానికి ముందుకు వచ్చారు. తద్వారా ఏడుగురికి అవయవ దానం చేసి ఆ కుటుంబ సభ్యులు స్ఫూర్తిగా నిలిచారు.
Pudimadaka Woman Organs Donate : పూడిమడకకు చెందిన యజ్జల అడివారం (30) ఈ నెల 3న రాత్రి 10 గంటల సమయంలో ఇంటి వద్ద అధిక రక్తపోటుకు గురైంది. ఈ విషయాన్ని గమనించిన పిల్లలు తల్లిని బతికించుకోవాలనే ఆశతో షీలానగర్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమె బ్రెయిన్లో నరాలు చిట్లిపోవడంతో సాధ్యంకాలేదు. ఈ క్రమంలోనే ఆమె బ్రెయిన్‌డెడ్ అయిన్నట్లు ఈ నెల 5న వైద్యులు తేల్చేశారు. ఈమేరకు అడివారం భర్త ముత్యాలు, పిల్లలు తాతారావు, రాజేశ్వరి, మేరుగు అప్పలనాయుడుకు తెలిపారు.