Best Home Remedies for Black Neck : అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం నిత్యం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది ముఖ సౌందర్యంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంటారు. కానీ.. చేతులు, కాళ్లు, మెడ వంటి భాగాల సంరక్షణను అంతగా పట్టించుకోరు. దాంతో అవి నల్లగా మారి అందవిహీనంగా కనిపిస్తుంటాయి.
అందులో ముఖ్యంగా చాలా మంది మహిళలు డార్క్ నెక్ సమస్యను ఎదుర్కొంటుంటారు. గర్భిణీలలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎక్కువ మంది మెడపై ఏర్పడిన నలుపుదనాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలీక సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారికోసమే కొన్ని బెస్ట్ హోమ్ రెమిడీస్ తీసుకొచ్చాం. అవి ఫాలో అయ్యారంటే ఈజీగా ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టమాటాతో ఇలా చేశారంటే..మెడ చుట్టూ ఏర్పడిన నలుపుదనాన్ని పోగొట్టడంలో ఈ హోమ్ రెమిడీ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా టమటా రసం, కొన్ని చుక్కల నిమ్మరసం, కాస్త తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేయాలి. అరగంట పాటు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఫలితంగా టమాటా, నిమ్మరసంలో ఉన్న విటమిన్ సి నల్లగా మారిన చర్మం తిరిగి మునుపటి రూపాన్ని పొందడానికి సహాయపడుతుంది. అలాగే తేనెలో ఉన్న గుణాలు స్కిన్‌కి మంచి పోషణనిచ్చి మృదువుగా చేస్తాయంటున్నారు.
కీరాదోసతో చెక్ పెట్టండిలా..మెడ చుట్టూ నల్లగా మారి ఇబ్బందిపడుతున్నారా? అయితే, ఓసారి కీరాదోసనుఇలా ట్రై చేయండి. కొద్దిరోజుల్లోనే నల్లగా మారిన మెడను తెల్లగా మెరిపించవచ్చంటున్నారు నిపుణులు. దీనికోసం ఒక చిన్న సైజ్ కీరాను తీసుకొని జాగ్రత్తగా తురుముకోవాలి. ఆపై ఆ తురుముతో నల్లగా మారిన మెడ భాగంలో పావుగంట పాటు మసాజ్ చేసుకోవాలి. అనంతరం గోరువెచ్చని వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఫలితంగా కీరాదోస మంచి క్లెన్సర్‌లా పనిచేసి మెడ చర్మంపై పేరుకున్న మురికిని పోగొట్టడమే కాకుండా.. అవసరమైన తేమనందించి స్కిన్‌ని నిగనిగలాడేలా చేస్తుందంటున్నారు.