Sprouts Poha Recipe in Telugu:మీరు సింపుల్‌గా, ఫాస్ట్‌గా అయిపోయే హెల్దీ టిఫిన్ కోసం చూస్తున్నారా? అయితే స్ప్రౌట్స్ పొహా మీకు బెస్ట్ ఆప్షన్. అనేక ప్రోటీన్స్, పోషకాలు నిండిన మొలకలు తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ, ఈ తీరులో చేసుకుంటే మాత్రం అలాంటి వారు సైతం ఎంతో ఇష్టంగా తింటారని చెబుతున్నారు. ముఖ్యంగా డైట్ పాటించే వారు, బ్యాచిలర్స్ దీనిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఇందులోకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు
- ఒకటిన్నర కప్పుల అటుకులు
- 3 టేబుల్ స్పూన్ల నూనె
- 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుండ్లు
- ఒక టీ స్పూన్ ఆవాలు
- ఒక టీ స్పూన్ జీలకర్ర
- 2 ఎండు మిరపకాయలు
- 2 కరివేపాకు రెబ్బలు
- పావు కప్పు ఉల్లిపాయ తరుగు
- 2 పచ్చిమిర్చి (సన్నని తరుగు)
- పావు కప్పు క్యారట్ తరుగు
- పావు కప్పు కాప్సికం తరుగు
- పావు కప్పు టమాటా సన్నని తరుగు
- రుచికి సరిపడా ఉప్పు
- పావు టీ స్పూన్ పసుపు
- పావు కప్పు ఫ్రోజెన్ బఠాణీ
- అర కప్పు మొలకలు
- పావు టీ స్పూన్ పంచదార
- 4 టేబుల్ స్పూన్ల నీళ్లు
- కొద్దిగా కొత్తిమీర
- ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం