తెలంగాణ

telangana

ETV Bharat / international

'పాలస్తీనా శరణార్థులకు పునరావాసం కల్పించండి'- ఈజిప్ట్​, జోర్డాన్​లకు ట్రంప్‌ పిలుపు! - TRUMP WANTS GAZA CLEAN OUT

జోర్డాన్‌ రాజు అబ్దుల్లా-IIకు ట్రంప్ ఫోన్​ - పాలస్తీనా శరణార్థులకు పునరావాసం కల్పించాలని హితవు!

Trump Wants Gaza Clean Out
Trump Wants Gaza Clean Out (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2025, 9:52 PM IST

Trump Wants Gaza Clean Out : పాలస్తీనా శరణార్థులను జోర్డాన్​, ఈజిప్టులు పునరావాసం కల్పించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఇప్పటికే జోర్డాన్‌ రాజు అబ్దుల్లా-IIకు ఫోన్‌ చేసి ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ చేపట్టిన భీకర దాడులతో గాజా అతలాకుతలమైంది. పెద్దఎత్తున నిర్మాణాలు నేలమట్టం కావడం వల్ల లక్షలాది మంది పాలస్తీనీయులు నిరాశ్రయులయ్యారు. అయితే ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడం వల్ల వారంతా తిరిగి తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఈ పరిణామాల నడుమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. నిరాశ్రయులుగా మారిన పాలస్తీనా శరణార్థులకు గాజా పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్‌లు పునరావాసం కల్పించాలన్నారు.

అలా చేస్తేనే శాంతి: ట్రంప్​
"గాజా ప్రాంతం శిథిలాల కుప్పగా మారింది. అక్కడున్న ప్రతీది నాశనమైంది. ప్రజలు చనిపోతున్నారు. అందుకే వారికి ఆశ్రయం కల్పించేందుకు అరబ్‌ దేశాలతో కలిసి వేరే ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని భావిస్తున్నా. అక్కడ వారు శాంతియుతంగా జీవించవచ్చు. ఈ పునరావాసం తాత్కాలిక కాలానికే పరిమితం కావచ్చు. లేదా దీర్ఘకాలం కొనసాగొచ్చు" అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఈజిప్టు అధ్యక్షుడితోనూ దీనిపై చర్చిస్తానని తెలిపారు. ఈజిప్టు, జోర్డాన్‌లు ఈ విషయంపై స్పందించాల్సి ఉంది. ఐరాస వివరాల ప్రకారం, జోర్డాన్‌లో ఇప్పటికే దాదాపు 24 లక్షలమంది పాలస్తీనా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు.

ట్రంప్ సూచనలను ఒప్పుకోం!
ఇజ్రాయెల్‌, పాలస్తీనాల వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు 'ద్విదేశ పరిష్కార'మే మార్గమని అమెరికా దశాబ్దాలుగా చెబుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ట్రంప్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు హమాస్‌, పాలస్తీనీయులు ఈ ప్రతిపాదనలను వ్యతిరేకించే అవకాశం ఉన్నట్లు సమాచారం. "గాజావాసులు 15 నెలలపాటు విధ్వంసాన్ని, మారణకాండను భరించారు. కానీ, వారు ఎక్కడికీ వెళ్లలేదు. పునర్నిర్మాణం పేరిట ట్రంప్‌ ప్రతిపాదనలు మంచి ఉద్దేశంగా కనిపించినప్పటికీ, స్థానికులు ఇటువంటి పరిష్కారాలను అంగీకరించరు" అని హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు బస్సెం నయీమ్ ఓ వార్తాసంస్థకు తెలిపారు.

హమాస్‌ చెరలోని మరో నలుగురు బందీలు రిలీజ్ - అందరూ మహిళా సైనికులే!

ఇజ్రాయెల్‌ సైన్యాధిపతి రాజీనామా - ఆ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ!

ABOUT THE AUTHOR

...view details