తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యాలో 'మినిస్ట్రీ ఆఫ్​ సెక్స్​'- ఫస్ట్​ డేట్​కు ప్రభుత్వమే డబ్బులిస్తుందట!

జననాల రేటు పెరగడానికి రష్యా వినూత్న ప్రయత్నం - కొత్తగా 'మినిస్ట్రీ ఆఫ్​ సెక్స్'​ ఏర్పాటు!- అంతర్జాతీయ మీడియాలో కథనాలు

Russia New Sex Ministry
Russia New Sex Ministry (Associated Press, ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2024, 5:21 PM IST

Russia New Sex Ministry :దాదాపు రెండేళ్లగా ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ జనన-మరణాల్లో అంతరం భారీగా పెరుగుతున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలో 'మినిస్ట్రీ ఆఫ్ సెక్స్' పేరిట కొత్త శాఖను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కుటుంబ రక్షణకు సంబంధించిన పార్లమెంట్ కమిటీ ఇప్పుడు దానిని పరిశీలిస్తోందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

ఫస్ట్​ డేట్​ ఖర్చు ప్రభుత్వానిదే!
జనన మరణాల రేటు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు సరికొత్త వ్యూహాలను అమలు చేయాలంటూ అధ్యక్షుడు పుతిన్ గతంలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఓ ఏజెన్సీ ఈ ప్రతిపాదన చేసింది. జననాల రేటును పెంచే కార్యక్రమాలన్ని ఈ శాఖ పరిధిలో ఉంచాలంటూ కొన్ని సూచనలు చేసింది. బంధాలను ప్రోత్సహించేందుకు యువతకు ఫస్ట్ డేట్‌కు 5000 రూబెల్స్‌ ఇవ్వాలని సూచనలు ఇచ్చింది. ఇంటిపనులు, పిల్లలను చూసుకునేందుకు ఉద్యోగం మానేయాలనుకునేవారికి కొంతమొత్తం చెల్లించాలని సలహా ఇచ్చింది. వీటితో పాటు మరికొన్ని అసాధారణ ప్రతిపాదనలు కూడా చేసింది ఏజెన్సీ. ఇదిలా ఉండగా, ఈ జననాల రేటును పెంచడం కోసం మహిళల వ్యక్తిగత వివరాలను అధికారులు సేకరిస్తున్నట్టు పలు వార్తలు వచ్చాయి. అందులో భాగంగా ప్రభుత్వ రంగానికి చెందిన మహిళా ఉద్యోగులకు కొన్ని ప్రశ్నలతో కూడిన ఫామ్స్‌ అందినట్లు పేర్కొన్నాయి.

గవర్నమెంట్​ లెక్కల ప్రకారం- రష్యాలో ఈ సంవత్సరంలో జూన్‌ వరకు 5,99,600 మంది పిల్లలు జన్మించారు. 2023 జూన్‌తో పోలిస్తే దాదాపు 16,000 పిల్లలు తక్కువ. 1999 నుంచి జననాల రేటులో తగ్గుదల నమోదవుతోంది. మరోవైపు, 2024 జనవరి నుంచి జూన్ మధ్య 3,25,100 మరణాలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇవి 49,000 వరకు అధికంగా ఉన్నాయి. రష్యాకు వచ్చిన వలసదారుల జనాభా 20.1 శాతం ఉండటం వల్ల ఈ క్షీణత కొంత వరకు భర్తీ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

10 మంది పిల్లల్ని కంటే- 'మదర్​ హీరోయిన్ అవార్డు'
కొన్నేళ్లుగా రష్యాలో జనాభా పెరగడానికి సోవియట్‌ కాలంలో అమలులో ఉన్న ఓ పురస్కారాన్ని 2022లో పుతిన్‌ మళ్లీ పునరుద్ధరించారు. పది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలకు మిలియన్‌ రూబెల్స్‌ (రూ.13లక్షలకుపైగా) నజరానా ఇస్తారు. 'మదర్‌ హీరోయిన్‌' అవార్డును కూడా ఇస్తామని పుతిన్‌ ప్రభుత్వం ప్రకటన చేసింది. అయితే పదో బిడ్డ మొదటి పుట్టినరోజు నాడు ఈ నగదు చెల్లిస్తామని పేర్కొంది. అప్పటికి మిగతా 9 మంది పిల్లలు జీవించి ఉండాలని షరతు పెట్టింది. అయితే ఈ ప్రకటన తర్వాత కూడా జననాల రేటులో పెద్దగా మార్పు కనిపించడం లేదని సమాచారం.

ఇండియన్​ మూవీస్​ అంటే ఎంతో ఆసక్తి- రష్యాలో 'బ్రిక్స్​' మ్యూజిక్ ఫెస్టివల్: పుతిన్

పుతిన్ దోస్త్​ మేరా దోస్త్- ప్రపంచాన్ని ఎదురించి మరీ కిమ్​కు స్పెషల్ గిఫ్ట్

ABOUT THE AUTHOR

...view details