తెలంగాణ

telangana

ETV Bharat / international

కేజీ కాకర@రూ.1000, బెండకాయలు రూ.650, మ్యాంగోస్​కు రూ.2400- ఇలా అయితే కష్టమే అంటున్న NRIలు! - Mango Cost In London - MANGO COST IN LONDON

Mango Cost In London Shocks Internet : 6 ఆల్ఫోన్సో మామిడిపండ్లు ఎంతో తెలుసా? రూ.2,400. కేజీ కాకరకాయలు ఎంత అనుకుంటున్నారు? రూ.1000. ఇంతేసి రేట్లు చెల్లించి లండన్ ప్రజలు నిత్యం పండ్లు, కూరగాయలను కొంటున్నారు. అక్కడున్న ధరల రేంజ్​ను అద్దంపట్టే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. పూర్తి వివరాలు మీకోసం.

Mango Cost In London Shocks Internet
Mango Cost In London Shocks Internet (GettyImages)

By ETV Bharat Telugu Team

Published : Jun 24, 2024, 3:28 PM IST

Mango Cost In London Shocks Internet :6 ఆల్ఫోన్సో మామిడిపండ్ల ధర రూ.2,400. కేజీ కాకరకాయలు రూ.1000. కేజీ బెండకాయలు రూ.650. టెన్షన్ పడకండి. ఈ రేట్లు మనదేశానికి చెందినవి కావు. బ్రిటన్ రాజధాని లండన్‌లో కూరగాయలు, పండ్ల ధరలు ఈ రేంజ్​లో ఉన్నాయి. లండన్‌లో నివసిస్తున్న దిల్లీ వనిత చవి అగర్వాల్ ఈనెల ప్రారంభంలో అక్కడున్న ఓ ఇండియన్ స్టోర్‌ను సందర్శించారు. అందులో పండ్లు, కూరగాయల రేట్లు ఎంతమేర ఉన్నాయనే వివరాలను తెలుపుతూ ఆమె ఓ వీడియో చేశారు. దాన్ని ఈనెల ప్రారంభంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. దానికి 60 లక్షలకుపైగా వ్యూస్, దాదాపు 1.35 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి.

నెటిజన్ల మైండ్ బ్లాంక్
లండన్‌‌లో ధరల మంట గురించి చవి అగర్వాల్ వివరిస్తుంటే విని నెటిజన్ల మైండ్ బ్లాంక్ అయింది. వామ్మో, ఇంతేసి రేట్లు ఉంటే బతికేది ఎలా అని గగ్గోలు పెట్టుకున్నారు. ఇండియాలో పుట్టాం కాబట్టి బతికిపోయాం అంటూ కొందరు నెటిజన్స్ ఊపిరి పీల్చుకున్నారు. లండన్‌లో కూరగాయలు, పండ్ల వ్యాపారం ప్రారంభిస్తే బెటరేమో అని కొందరు ఫన్నీ కామెంట్స్ పెట్టారు. ''బ్రిటన్, భారత్ ప్రజల తలసరి ఆదాయాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆదాయ సముపార్జనలో ఇరుదేశాల ప్రజలను ఒకేగాటన కట్టి ఎలా చూస్తారు. మన దేశంతో పోలిస్తే బ్రిటన్ ప్రజల కొనుగోలు శక్తి చాలా ఎక్కువనే విషయాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి'' ఓ నెటిజన్ లాజికల్‌గా విశ్లేషణ చేశాడు.

జులై 4న బ్రిటన్ ఎన్నికలు
వీడియోలో చవి అగర్వాల్ చెప్పిన ప్రకారం, లేస్‌ మాజిక్ మసాలా ప్యాక్‌ ధర భారత్‌లో రూ.20 ఉండగా, లండన్‌లో దాని ధర రూ.95. అక్కడ పన్నీర్‌ ప్యాకెట్ రేటు ఏకంగా రూ.700 ఉంది. మొత్తం మీద మనదేశంలో పదుల రూపాయల్లో ఉండే కూరగాయల రేట్లు ఫారిన్‌‌లో వందల రూపాయలు పలుకుతున్నాయి. మన దేశంలో వందల రూపాయల్లో ఉండే పండ్ల రేట్లు కొన్ని దేశాల్లో వేల రూపాయల్లో ఉన్నాయనేది పచ్చి నిజం. బ్రిటన్ కరెన్సీ(పౌండ్‌ స్టెర్లింగ్‌)ని మనదేశ రూపాయల్లో పోల్చి చూస్తే ఇదేవిధంగా ధరలు ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. వచ్చే నెల 4న బ్రిటన్ పార్లమెంటరీ ఎన్నికలు జరగబోతున్నాయి. బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానన్న హామీతో రిషి సునాక్‌ గద్దెను ఎక్కారు. అక్కడి ప్రజలు ఓటు వేసే ముందు నిత్యావసరాల ధరలను కూడా పరిగణనలోకి తీసుకుంటారని పరిశీలకులు చెబుతున్నారు.

హజ్ యాత్రలో 1,300 మంది మృతి- ఆ దేశస్థులే అత్యధికం- అదే కారణమట! - Hajj pilgrimage 2024

చర్చిలు, పోలీస్ స్టేషన్లపై ఉగ్రదాడి- 15మందికి పైగా పోలీసులు, పౌరులు మృతి- ఆరుగురు ఉగ్రవాదులు హతం

ABOUT THE AUTHOR

...view details