తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫ్రెంచ్ వైద్యుడి అరాచకం- 299 రోగులపై అత్యాచారం- చిన్నారులనూ వదలని మానవ మృగం! - FRENCH SURGEON RAPING CHILDREN

మానవ మృగంగా మారిన ఫ్రెంచ్ వైద్యుడు- చికిత్స కోసం వచ్చిన రోగులపై అత్యాచారం- చిన్న పిల్లలే టార్గెట్- చివరకి అబ్బాయిలనూ వదల్లేదు!

French surgeon Joel Le Scouarnec
French surgeon Joel Le Scouarnec (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2025, 8:08 PM IST

French Surgeon Raping Children : వైద్యో నారాయణో హరి అంటారు. వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. అలాంటి పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న సమయంలో ఓ డాక్టర్‌ అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. దాదాపు 30 ఏళ్ల సర్వీసులో 299 మంది రోగులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. నిందితుడి ఇంట్లో జరిపిన సోదాల్లో 3 లక్షలకు పైగా ఫొటోలు , 650కి పైగా అశ్లీల వీడియోలు, నోట్‌బుక్స్‌ బయటపడ్డాయి. ఫ్రాన్స్‌లో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ కేసులో నిందితుడైన 74 ఏళ్ల "జోయెల్‌ లి స్కౌర్నెక్‌పై" విచారణ కొనసాగుతోంది.

మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి
ఫ్రాన్స్‌లోని బ్రిటానీ అనే ప్రాంతంలో నిందితుడు జోయెల్‌ ఓ ఆసుపత్రిలో సర్జన్‌గా పని చేసేవాడు. 30 ఏళ్ల పాటు తన వద్దకు వచ్చే రోగులపై దారుణాలకు పాల్పడ్డాడు. వారికి మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి చేసేవాడు. ఇన్నేళ్లు ఈ దారుణాలు కొనసాగినా, అతడి అకృత్యాలు 2017లో బయటపడ్డాయి. తన పొరుగింట్లో ఉన్న ఓ ఆరేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించడం వల్ల జోయెల్‌పై కేసు నమోదైంది. దర్యాప్తు నిమిత్తం పోలీసులు అతడి ఇంట్లో సోదాలు చేపట్టగా ఏకంగా 3 లక్షలకు పైగా ఫొటోలు బయటపడ్డాయి. 650లకు పైగా అశ్లీల వీడియోలు, నోట్‌బుక్స్‌ను కూడా గుర్తించారు.

చిన్నారులే టార్గెట్​
చిన్నారులకు ఎక్కువగా ఆకర్షితుడై శృంగార కార్యకలాపాలు నెరిపినట్లు అతడి డైరీల్లో ఉండటం చూసి అధికారులు ఆశ్యర్యపోయారు. ఎవరెవరిపై లైంగిక దాడి జరిపాడో ఆ వివరాలను ఈ మాజీ సర్జన్‌ ఎప్పటికప్పుడు నోట్‌ చేసుకున్నట్లు గుర్తించారు. ఆ ఘటన తర్వాత మరో నలుగురు చిన్నారులు కూడా అతడి బాధితులని తేలారు. దీనితో 2020లో కోర్టు జోయెల్‌ను దోషిగా తేల్చి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయగా, అతడి పాపాల చిట్టా బయటపడింది. బాధితుల్లో చాలా మందికి తాము అత్యాచారానికి గురైన విషయం కూడా తెలియదు. జోయెల్‌ డైరీలో తమ పేర్లను చూసే ఈ విషయం తెలుసుకున్నామని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

అబ్బాయిలను కూడా వదల్లేదు!
నాలుగు నెలలుగా ఈ కేసులో విచారణను ముమ్మురం చేయగా, తాజాగా అతడు కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. 1989 నుంచి 2014 మధ్య 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడినట్లు న్యాయస్థానంలో తెలిపాడు. ఆ సమయంలో బాధితుల వయస్సు సగటున 11 ఏళ్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. తాను చాలా క్రూరమైన పనులు చేశానని, ఆ పిల్లల మనసుకు అయిన ఈ గాయం ఎన్నటికీ మానదని తెలిసినా అలా ప్రవర్తించాని పేర్కొన్నాడు. ఈ చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్నట్టు తెలిపాడు. కొన్ని ఘటనలు మాత్రం గుర్తు లేవని చెప్పాడు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. ఒకవేళ అతడిని దోషిగా తేలిస్తే మరో 20 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్‌లో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలను అరికట్టేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావాలని సామాజికవేత్తలు ఆందోళన నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details