Bomb Threats To Trump Cabinet Picks :అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికలై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, తన కార్యవర్గంలోని సభ్యులను ఒక్కొరిగా ఎంచుకుంటున్నారు. అయితే అందులో పలువురికి బాంబు బెదిరింపులు వస్తున్నాయని ట్రంప్ ట్రాన్సిషన్ ప్రతినిధి కరొలిన్ లీవిట్ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రంప్ కేబినెట్ నామినీలతో పాటు వారి కుటుంబ సభ్యలకూ బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. దీనిపై అధికారులు వేగంగా స్పందించారని, బెదిరింపులు ఎదుర్కొన్న వారి భద్రత కోసం త్వరగా చర్యలు తీసుకున్నారన్నారు. అధికారులు స్పందించిన తీరును లీవిట్ అభినందించారు.
ట్రంప్ కేబినెట్ మంత్రులకు బాంబు బెదిరింపులు - FBI రియాక్షన్ ఇదే! - BOMB THREATS TO TRUMP CABINET PICKS
అమెరికాకు రాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేబినెట్‌కు బాంబు బెదిరింపులు- ఎఫ్‌బీఐ స్పందనిదే!
Published : Nov 28, 2024, 9:10 AM IST
ఐరాసలో అమెరికా ప్రతినిధిగా ఎంపికైన ఎలిస్ స్టెఫానిక్ బెదిరింపులు వచ్చిన వారి జాబితాలో ఉన్నారు. ఈయన ప్రస్తుతం న్యూయార్క్ ప్రతినిధిగా ఉన్నారు. అంతేకాకుండా మాజీ కాంగ్రెస్ ప్రతినిధి మాట్ గేట్జ్కు కూడా బాంబు బెదిరింపు వచ్చినట్లు ఒకలూసా కౌంటీ షెరిఫ్ కార్యాలయం ఫేస్బుక్ పోస్ట్‌లో తెలిపింది. గేట్జ్‌ను అటార్నీ జనరల్‌గా డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేశారు. అయితే తాను మైనర్ బాలికగా ఉన్నప్పుడు గేట్జ్తో రెండుసార్లు శారీరకంగా కలుసుకొన్నట్లు ఓ మహిళ అమెరికా కాంగ్రెస్ నైతిక ప్రమాణాల కమిటీకి చెప్పారు. దీనిపై దుమారం రేగడం వల్ల అటార్నీ జనరల్ పదవిని స్వీకరించడం లేదని గేట్జ్ ప్రకటించారు. దీంతో ఆ పదవిలో పామెలా బాండీని నియమిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ బెదిరంపులపై ఎఫ్‌బీఐ స్పందించింది. "ట్రంప్ కేబినెట్ నామినీలను టార్గెట్‌గా వస్తున్న ఇలాంటి బెదిరింపుల గురించి మాకు తెలుసు. పోలీసుల అధికారులతో కలిసి ఈ ఘటనలను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఇలాంటి బెదిరింపులను మేము తీవ్రంగా పరిగణిస్తాం. అంతేకాకుండా ఇలాంటి అనుమాదాస్పద ఘటనలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందికా ప్రజలను ప్రోత్సహిస్తాము." అని ఎఫ్‌బీఐ పేర్కొంది.