తెలంగాణ

telangana

ETV Bharat / international

జంతువులకు టైమ్ గురించి తెలుసా? చిన్నచిన్న వాటి పరిస్థితి ఏంటి? - Animals Time Experience - ANIMALS TIME EXPERIENCE

Can Animals Know Time : మనుషులతో పోలిస్తే చిన్న జంతువులు ప్రపంచాన్ని స్లో మోషన్‌లో అనుభవిస్తాయని మీకు తెలుసా? వాటికి సమయం గురించి ఐడియా ఉంటుందా?

Can Animals Know Time
Can Animals Know Time (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 2:09 PM IST

Can Animals Know Time :మనకు రోజుకు 24 గంటలు అని, గంటకు 60 నిమిషాలు అని ఒక అవగాహన ఉంది. మరి జంతువులు ఈ విషయంలో ఎలా ఆలోచిస్తాయి? ఈ అనుమానం ఎప్పుడన్నా వచ్చిందా మీకు? పెంపుడు జంతువులు మన అలికిడిని బట్టి పగలు, రాత్రి గుర్తించగలవు. అలాగే వాటిలో ఉండే జీవ గడియారం బట్టి కూడా సమయాన్ని అర్థం చూసుకుని ప్రవర్తించగలవు. మరి ఇది ఉదయం 10 గంటలు, ఇది సాయంత్రం 4 గంటలు అలా తెలుసుకోగలుగుతాయా? అసలు విషయం కుక్కలు, పిల్లులు గురించి కాదు. బల్లులతోపాటు చిన్న జంతువులు పరిస్థితి ఏంటి?

నిజానికి పిల్లులు, కుక్కల కంటే బల్లులు సహా పలు చిన్న జంతవులు నెమ్మదిగా సమయాన్ని అనుభవిస్తాయి. ఎందుకంటే వచ్చిన సమాచారాన్ని మెదడు ఎంత త్వరగా ప్రాసెస్ చేయగలదో దానిపైనే సమయాన్ని అర్థం చేసుకునే శక్తి ఆధారపడి ఉంటుంది. కదిలే కాంతిని మెదడు పట్టుకునే శక్తిని బట్టి వీటి వేగం ఆధారపడి ఉంటుంది. బల్లులు, తొండలు వంటి జంతువులు చిన్నవే అయినా అవి సమయాన్ని గుర్తించనప్పటికీ- మనం పేపర్​తో కొట్టడానికి ప్రయత్నించినప్పుడు అవి దొరకకపోవడానికి కారణం అదే.

నిజానికి మనకంటే జంతువులే ఎక్కువ కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వేటాడే సమయంలో గానీ, ఎరను అందుకునే విషయంలో గానీ, జంతువులు త్వరగా స్పందించాల్సిన అవసరం ఉంది. అందుకే కొన్ని జీవులలో రక్త ప్రసరణ వేగంగా జరుగుతుంది. దీనివల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. పరిస్థితిని అతి త్వరగా అంచనా వేసేందుకు ఇది తోడ్పడుతుంది. అలాగే ఇది సెకనుకు ప్రాసెస్ చేయగలిగే విజువల్ ఫ్రేమ్​ల సంఖ్యను పెంచుతుంది.

ఎలుకలపై చేసిన అధ్యయనాలు మెదడులోని డోపమైన్ ఉత్పత్తి చేసే న్యూరాన్‌లను ప్రేరేపించడం ద్వారా సమయ అవగాహనను వేగవంతం చేయవచ్చని చూపించాయి. డోపమైన్ అనేది మెదడులోని నరాల కణాలు, శరీరంలోని నరాలతోపాటు కండరాల కణాల మధ్య సందేశాలను కమ్యూనికేట్ చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీర నియంత్రణతోపాటు సమన్వయం, మానసిక స్థితి, జ్ఞాపకశక్తి, శ్రద్ధ, ప్రేరణ మొదలైనవాటిని నియంత్రించగలదు.

ABOUT THE AUTHOR

...view details