తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో సిగ్నల్స్ బంద్- నెట్​వర్క్ లేక పనిచేయని సెల్​ఫోన్లు - us cellular network outage

America Cellular Outage : అమెరికాలో టెలికాం సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. షికాగో, లాస్‌ ఏంజిల్స్‌, న్యూయార్క్‌ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, హూస్టన్‌, బ్రూక్లిన్‌ ప్రాంతాల్లోని వినియోగదారులు సిగ్నల్‌ సమస్యను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

America Cellular Outage
America Cellular Outage

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 10:20 PM IST

Updated : Feb 23, 2024, 6:56 AM IST

America Cellular Outage : అమెరికాలో టెలికాం సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఏటీ&టీ, వెరిజోన్‌, టీ-మొబైల్‌తో పాటు ఇతర మొబైల్‌ నెట్‌వర్క్‌లలో కనెక్టివిటీ సమస్య తలెత్తినట్లు డౌన్‌డిటెక్టర్‌ అనే నెట్‌వర్క్‌ ట్రాకింగ్‌ సైట్‌ వెల్లడించింది. అనేక గంటల పాటు ఈ సమస్య కొనసాగింది. షికాగో, లాస్‌ ఏంజిల్స్‌‌, న్యూయార్క్‌ సిటీ, శాన్‌ఫ్రాన్సిస్కో, హూస్టన్‌, బ్రూక్లిన్‌ ప్రాంతాల్లోని వినియోగదారులు గురువారం తెల్లవారుజామున సిగ్నల్‌ సమస్య ఎదుర్కొన్నట్లు సమాచారం. ఒకే సమయంలో ఈ నెట్‌వర్క్‌లన్నింటిలో సమస్య తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. గురువారం మధ్యాహ్నానికి సమస్యను పరిష్కరించినట్లు ఏటీ&టీ తన వెబ్​సైట్ ద్వారా ప్రకటించింది. సేవల్లో అంతరాయానికి చింతిస్తున్నట్లు తెలిపింది.

ఒక్క ఏటీ&టీ కస్టమర్ల నుంచే 31వేల ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్‌డిటెక్టర్‌ వెల్లడించింది. వెరిజోన్‌కు వెయ్యికి పైగా ఫిర్యాదులు రాగా, టీ-మొబైల్‌కు చెందిన వినియోగదారుల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. ఒక్క ఏటీ&టీ కస్టమర్ల నుంచే 73వేల ఫిర్యాదులు వచ్చినట్లు డౌన్‌డిటెక్టర్‌ వెల్లడించింది. వెరిజోన్‌కు నాలుగువేలకు పైగా ఫిర్యాదులు రాగా టీ-మొబైల్‌కు చెందిన వినియోగదారుల నుంచి 1,800 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. బూస్ట్ మొబైల్ 700 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది. అత్యవసర సేవల కోసం (911) ప్రయత్నించే వారిపైనా దీని ప్రభావం పడినట్లు శాన్‌ఫ్రాన్సిస్కో ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. అయితే, ఈ భారీ అంతరాయానికి గల కారణాలు మాత్రం వెల్లడి కావాల్సి ఉంది. సైబర్‌ దాడిపై అనుమానం వ్యక్తంచేస్తూ అనేకమంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

పాకిస్థాన్​లో టెలికాం సేవలకు అంతరాయం
కొంతకాలం క్రితం పాకిస్థాన్​లో ఇలాంటి ఘటనే జరిగింది. పాకిస్థాన్​లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్​తో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఆప్టిక్ ఫైబర్ నెట్​వర్క్​లో సాంకేతిక లోపం ఏర్పడింది. ఆప్టిక్​ ఫైబర్ నెట్​వర్క్​లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయని, వాటిని పరిష్కరించామని అధికారులు పేర్కొన్నారు. ఇస్లామాబాద్​, లాహోర్ పట్టణాల్లో ఇంటర్నెట్ ఆగిపోవడం వల్ల బ్యాంక్​లు, ఆన్​లైన్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాకిస్థాన్​లో 3జీ నెట్​వర్క్​లో 116 మిలియన్ల వినియోగదారులు, 4జీ నెట్​వర్క్​కు 119 మిలియన్ల వినియోగదారులు ఉన్నారని పాకిస్థాన్ టెలికాం అథారిటీ తెలిపింది. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్​పై క్లిక్చేయండి.

మాల్దీవుల్లోకి ప్రవేశించిన చైనా పరిశోధక నౌక- ఆందోళన వ్యక్తం చేసిన ఇండియన్ నేవీ

బంగారం గనిలో ప్రమాదం- 14మంది మృతి- లోపల అనేక మంది!

Last Updated : Feb 23, 2024, 6:56 AM IST

ABOUT THE AUTHOR

...view details