Food habits in Old age :వయసులో ఉన్నప్పుడు తిండి విషయంలో పెద్దగా చింత ఉండదు. ఏం తిన్నా.. ఎలా తిన్నా.. కాలం గడిచిపోతుంది. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతీదాన్ని వెనుకాముందు చూసుకోవాల్సి వస్తుంది. మునపటిలా అరగించుకునే శక్తి తగ్గిపోతుంది. వయసుతోపాటు జీవ క్రియలు మందగిస్తాయి. జీర్ణశక్తి, ఆకలి తగ్గుతుంది. ఒక వైపు షుగర్, బీపీ, క్యాన్సర్ లాంటి పీడించే వ్యాధులు.. మరోవైపు వాటిని అదుపులో ఉంచుకునేందుకు వాడే మందులు మూలంగా కడుపులో సమస్యలు పెరుగుతుంటాయి. ఇలాంటి నేపథ్యంలో రోజూవారీ ఆహారం విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 60ఏళ్ల తర్వాత ఆహార నియమాలు చక్కగా ఉంటే.. అవే అద్భుతమైన ఔషధాలుగా పనిచేస్తాయని చెబుతారు పోషకాహార నిపుణులు.
కొందరు వృద్ధులు ఆరోగ్యంగానే ఉంటున్నా.. లోపల శారీరక మార్పులు మాత్రం జరుగుతుంటాయని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ అంజలీ దేవి వివరించారు. దీనిని గుర్తుంచుకుని శారీరక స్థితిని బట్టి ఆహారాన్ని మార్చుకోవాలని సూచించారు. సమయానికి ఆహారం తీసుకోవాలని.. వయసుకు, శక్తికి తగ్గ వ్యాయామం చేయాలని చెప్పారు. ఈ క్రమంలోనే వృద్ధులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలా తినాలి? ఇలాంటి ప్రశ్నలకు డాక్టర్ అంజలీ దేవి చెబుతున్న సమాధానాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
వృద్ధులు తినాల్సినవి
- ఆకు కూరలు
- కూరగాయలు
- దుంపలు
- గింజ ధాన్యాలు
- మాంసకృత్తులు
- ఐరన్, కాల్షియం ఉండే ఆహారం
- బీ కాంప్లెక్స్, విటమిన్ డీ ఉండే పండ్లు
- పాలు, పాల పదార్థాలు
- పీచు లభించే పండ్లు, కూరగాయలు
- ముడి, దంపుడు బియ్యం
- విటమిన్ డీ సప్లమెంట్స్(డాక్టర్ సలహా మేరకు)
- రాగులు
- చేపలు
- నీళ్లు ఎక్కువగా తాగాలి
వృద్ధులు తినకూడనివి..
- ఉప్పు
- చక్కెర
- స్వీట్లు
- డీప్ ఫ్రై చేసిన వంటకాలు
- ఫాస్ట్ఫుడ్
- కర్రీపాయింట్లలో కూరలు
- నెయ్యి
- పొద్దుతిరుగుడు నూనె