Ayurveda Tips for Weight Gain :ప్రస్తుత రోజుల్లో బరువు తగ్గించుకునేందుకు ఉదయాన్నే కాళ్లకు బూట్లు తగిలించుకునే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే.. తాము మరీ సన్నగా ఉన్నామనీ, బరువు పెరగాలని కోరుకునేవారు కూడా ఉన్నారు. వయసుకు తగ్గ బరువు ఉండడం చాలా అవసరం. ఈ విషయాన్ని డాక్టర్లు గుర్తు చేస్తూనే ఉంటారు. కానీ వివిధ కారణాల వల్ల చాలా మంది సరైన బరువు ఉండరు.
అయితే.. ఎలాగైనా బరువు పెరగాలనే ఉద్దేశ్యంతో అధిక కొవ్వు పదార్థాలున్న ఆహారం తింటే.. మరో విధమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి.. లేనిపోని సమస్యలు తెచ్చుకోకుండా అవసరమున్నంత మేరకే బరువు పెరగాలంటే ఆయుర్వేద పథ్యాహారం చాలా మంచిదని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవీ. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బరువు పెరిగేందుకు పథ్యాహారం:
కావాల్సిన పదార్థాలు:
- విధారి చూర్ణం - 1 కప్పు
- గోధుమ పిండి 1 కప్పు
- బార్లీ పిండి - 1 కప్పు
- పాలు - 1 కప్పు
- చక్కెర - 3 కప్పులు
- నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు
మీ పిల్లలు బరువు పెరగట్లేదా? - ఈ ఫుడ్స్ తినకపోవడమే కారణం!
తయారీ విధానం:
- ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాలు పోసుకోవాలి.
- ఆ తర్వాత పాలల్లో పంచదార వేసి కరిగించుకోవాలి..
- ఈ లోపు మరో గిన్నె తీసుకుని అందులోకి గోధుమ పిండి, బార్లీ పిండి, విధారి చూర్ణం వేసుకుని కలుపుకోవాలి.
- పంచదార కరిగిన తర్వాత అందులోకి నెయ్యి వేసుకుని కలుపుకోవాలి.
- ఆ తర్వాత గోధుమపిండి, బార్లీ పిండి, విధారి చూర్ణం మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి.
- ఆ తర్వాత పాన్కు అంటుకోకుండా సపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్ తీసి పక్కకు పెట్టుకోవాలి.
- అంతే ఆరోగ్యకరంగా బరువు పెరిగేందుకు పథ్యాహారం రెడీ.
ఎలా తీసుకోవాలంటే:ఈ పథ్యాహారాన్ని రోజులో ఒకసారి.. కమలాపండు పరిమాణంలో తీసుకోవాలని చెబుతున్నారు.