తెలంగాణ

telangana

ETV Bharat / health

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ "వాల్​నట్స్" తినాలట - పరిశోధనలో ఆసక్తికర విషయాలు! - WALNUTS HEALTH BENEFITS

యక్త వయసులో గుండె జబ్బుల ముప్పు తప్పాలంటే - ఇవి తినాల్సిందే అంటున్న నిపుణులు!

WALNUTS HEALTH BENEFITS
Health Benefits of Walnuts (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2024, 1:35 PM IST

Health Benefits of Walnuts :ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే చాలా మంది వివిధ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారినపడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులను ఎదుర్కొంటున్నారు. సడెన్​గా​ సంభవించే గుండె జబ్బుల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎక్కువ మంది మెరుగైన ఆరోగ్యం కోసం డైలీ డైట్​లో వివిధ రకాల పండ్లు, నట్స్, సీడ్స్ వంటివి తీసుకుంటుంటారు.

అందులో ముఖ్యంగా వాల్​నట్స్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు. అన్నింటి కంటే ముఖ్యంగా వాల్​నట్​లను తినడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు. అంతేకాదు, ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో కూడా వాల్​నట్స్​ తీసుకోవడం ద్వారా యుక్త వయసులో గుండె జబ్బుల బారిన పడే అవకాశాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని కనుగొన్నారు. ఇంతకీ, వాల్​నట్స్​లో ఎలాంటి పోషకాలు ఉంటాయి? అవి తినడం ద్వారా గుండెకు ఏవిధంగా మేలు జరుగుతుంది? పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

ఇటీవల "యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్" పరిశోధకులు ఈ రీసెర్చ్​ను జరిపారు. ఇది "న్యూట్రిషన్, మెటబాలిజం & కార్డియోవాస్కులర్ డిసీజెస్" అనే జర్నల్‌లో ప్రచురితమైంది. ముఖ్యంగా వాల్​నట్స్​లో వృక్ష సంబంధ ఒమేగా 3 ఆల్ఫా లినోలెనిక్ కొవ్వు ఆమ్లం దండిగా ఉంటుందని కనుగొన్నారు. అదొక్కటే కాకుండా వీటిలో పీచు, ప్రొటీన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్​తో పాటు మరికొన్ని ఇతర ముఖ్యమైన పోషకాలు ఎక్కువే ఉన్నాయని గుర్తించారు. అలాగే, వాల్‌నట్స్​ పాలీఫెనాల్స్‌తో సహా అనేక రకాల యాంటీఆక్సిడెంట్‌లను కూడా అందిస్తాయి. కాబట్టి, వీటిని డైలీ తీసుకోవడం ద్వారా అందులో ఉండే పోషకాలన్నీ కౌమారదశ, యుక్తవయస్సులో అనేక గుండె జబ్బుల బారినపడకుండా కాపాడుతాయని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాదు, క్యాన్సర్‌, ఊబకాయం, మధుమేహం, మెదడు సంబంధిత సమస్యల కూడా దరిజేరకుండా రక్షిస్తాయని ఈ రీసెర్చ్​లో వెల్లడైంది.

ఈ పరిశోధనలో పాల్గొన్నవారిలో ఒకరైన యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్​లో ఎపిడెమియాలజీ, కమ్యూనిటీ హెల్త్ ప్రొఫెసర్ లిన్ ఎమ్. స్టెఫెన్ ఈ విధంగా అన్నారు. వాల్‌నట్స్​ తినేవారు ఇతర డ్రైఫ్రూట్స్ తినే వారికంటే మెరుగైన గుండె జబ్బుల ప్రమాద కారకాల ప్రొఫైల్‌ను కలిగి ఉంటారని పేర్కొన్నారు. అలాగే, ఆరోగ్యకరమైన పోషకాహారం, జీవనశైలి అలవాట్లను ఏర్పరచుకోవడంలో ప్రజలకు సహాయపడటానికి వాల్‌నట్స్​ వారధిగా లేదా 'క్యారియర్ ఫుడ్'గా పనిచేస్తాయన్నారు. నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ హెల్త్​ సభ్యుల బృందం జరిపిన ఒక రిసెర్చ్​లో కూడా వాల్​నట్స్ తినడం యుక్త వయసులో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని కనుగొన్నారు. అందుకు సంబంధించి రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవీ చదవండి :

శరీరం పంపే హెచ్చరికలను గుర్తించారా? ఈ రోగాలు వస్తాయని బాడీ ముందే చెప్పేస్తుందట! అవేంటో తెలుసా?

హార్ట్ ఎటాక్ తెల్లవారుజామునే ఎందుకు వస్తుందో తెలుసా? గుండెపోటు వస్తే ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలట!

ABOUT THE AUTHOR

...view details