Natural Home Remedies to Make Beard Black :నేటి రోజుల్లో చాలా మంది పురుషులు ముఖ్యంగా యువత చిన్న వయసులోనే తెల్ల గడ్డం సమస్యను ఎదుర్కొంటున్నారు. దీంతో కొందరు వైట్ బియర్డ్ నల్లగా కనిపించేందుకు మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంటారు. అయితే, వీటిలోని రసాయనాలు చర్మంపై దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి, అలాకాకుండా ఇప్పుడు చెప్పబోయే కొన్ని హోమ్ రెమిడీస్తో నేచురల్‌గా మీ తెల్లగడ్డాన్ని(Beard) నల్లగా మార్చుకోవచ్చంటున్నారు. ఇంతకీ, ఆ హోమ్ రెమిడీస్ ఏంటి? ఎలా యూజ్ చేయాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బ్లాక్ వాల్నట్స్ :మీ నెరిసిన గడ్డాన్ని నల్లగా మార్చడంలో బ్లాక్ వాల్నట్స్ చాలా బాగా ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం.. ముందుగా 7 నుంచి 8 బ్లాక్ వాల్నట్లను తీసుకొని పొడిలా చేసుకోవాలి. ఆపై దానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కనీసం అరగంట పాటు మరిగించుకోవాలి. అనంతరం దానిని చల్లార్చుకొని మీ గడ్డానికి అప్లై చేసుకోవాలి. అలా సుమారు 20 నిమిషాల పాటు ఉంచి ఆపై క్లీన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. బియర్డ్‌కు ఆ పేస్ట్ అప్లై చేసేటప్పుడు చేతులకు అంటుకోకుండా హ్యాండ్ బ్లౌజ్ ధరించడం మంచిది.
బ్లాక్ టీ : తెల్ల గడ్డంతో ఇబ్బందిపడేవారికి బ్లాక్ టీ బెస్ట్ ఆప్షన్ అని.. మంచి ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం.. ఒక కప్పు వేడి నీటిలో బ్లాక్ టీ బ్యాగ్‌లను వేయండి. ఆపై అది చల్లారాక ఆ మిశ్రమాన్ని మీ గడ్డానికి అప్లై చేయండి. అలా 30 నిమిషాల నుంచి గంట వరకు ఉంచండి. ఫలితంగా బ్లాక్ టీలో ఉండే టానిన్లు మీ గడ్డాన్ని నల్లగా మార్చడంలో సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు.
ఆమ్లా ఆయిల్ : మీరు గుబురుగా ఉండే నల్లని గడ్డాన్ని కోరుకుంటే ఆమ్లా ఆయిల్‌ను ఇలా ట్రై చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చంటున్నారు నిపుణులు. ఉసిరిలో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు బియర్డ్‌ను బ్లాక్‌గా మార్చడంలో చాలా బాగా ఉపయోగపడతాయంటున్నారు. ఇందుకోసం ఉసిరి నూనెను మీ గడ్డానికి అప్లై చేసి ఆపై మసాజ్ చేయాలి. రాత్రంతా అలాగే ఉంచి మార్నింగ్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
2016లో 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. 6 నెలల పాటు రోజుకు రెండుసార్లు గడ్డంపై ఉసిరి ఆయిల్‌ను మసాజ్ చేసిన పురుషులలో గడ్డం పెరుగుదల కనిపించడంతో పాటు నెరిసిన గడ్డం కాస్త నల్లగా మారిందని తేలింది. ఈ పరిశోధనలో ఇరాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన ప్రముఖ చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ షాహిన్ షేఖ్ పాల్గొన్నారు. ఉసిరి ఆయిల్‌ను గడ్డానికి మసాజ్ చేయడం ద్వారా అందులోని పోషకాలు బియర్డ్ పెరుగుదలకు, రంగును మార్చడంలో చాలా బాగా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.