ETV Bharat / offbeat

ఇంట్రస్టింగ్ : ఇదే "నో షేవ్ నవంబర్" అసలు ఉద్దేశం - తెలిస్తే మీరు ఈ నెలలో ఆ పనిచేస్తారు! - NO SHAVE NOVEMBER

నవంబర్ నెలలో చాలా మంది యువకులు ఎందుకు గడ్డం పెంచుతారో తెలుసా? - దాని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇదేనట!

WHAT IS NO SHAVE NOVEMBER
No Shave November (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2024, 9:44 PM IST

No Shave November : నవంబర్ అనగానే ఎవరికి ఏది గుర్తొచ్చినా.. మగవాళ్లకు మాత్రం ముందుగా గుర్తొచ్చేది గడ్డం. ఎందుకంటే.. ఈ నెలలో చాలా మంది యువకులు గడ్డం తీసేయడానికి ఒప్పుకోరు. అందుకు కారణం అడిగితే "నో షేవ్ నవంబర్" అని చెబుతుంటారు. దాంతో నవంబర్ మొత్తం బ్లేడ్, ట్రిమ్మర్లకు పని చెప్పకుండా గడ్డాన్ని పెంచుతుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదొక సంప్రదాయంగా మారిపోయింది. కానీ, చాలా మందికి దీని వెనుక ఉన్న అసలు కథేంటో తెలియదు. మరి, ఇంతకీ "నో షేవ్ నవంబర్" ఉద్దేశం ఏంటి? దీన్ని ఎవరు ప్రారంభించారు? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అసలు ఉద్దేశం ఇదే!

‘నో షేవ్‌ నవంబర్’ సంప్రదాయం 2009 నుంచి కొనసాగుతూ వస్తోంది. ఎవరైనా సరే గడ్డం ఈ ఒక్క నెల షేవింగ్ చేసుకోవద్దు. అలాగే.. షేవింగ్​కి, గడ్డాన్ని స్టైల్‌గా మార్చుకోవడానికి అయ్యే ఖర్చులను మిగిల్చి ఆ డబ్బును ఏదైనా క్యాన్సర్‌(Cancer) బాధితులను ఆదుకునే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలనేది "నో షేవ్ నవంబర్" ఉద్దేశం.

ఎవరు స్టార్ట్ చేశారంటే?

అమెరికాకు చెందిన మాథ్యూ హిల్‌ అనే వ్యక్తి మరణానంతరం ఆయన ఎనిమిది మంది సంతానం ఈ ‘నో షేవ్‌ నవంబర్‌’ సంప్రదాయాన్ని స్టార్ట్ చేశారు. 2007లో మాథ్యూ హిల్‌ క్యాన్సర్‌తో చనిపోయారు. అప్పుడు ఆయన పిల్లలు తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక చాలా రోజులు ఎంతో బాధపడ్డారు. అలాగే, ఎంతో మంది క్యాన్సర్‌‌ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న విషయం వారిలో మరింత బాధను కలిగించింది. దాంతో ఎలాగైనా క్యాన్సర్‌‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని, క్యాన్సర్‌‌పై పరిశోధనలు చేసే సంస్థలకు, క్యాన్సర్‌‌ బాధితులను ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థలకు ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే అందరిలా డబ్బులు విరాళంగా ఇస్తే అది తమతోనే ఆగిపోతుందని.. అలా కాకుండా ప్రజలతోనూ క్యాన్సర్‌‌పై కృషి చేస్తున్న పరిశోధన, స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం ఇప్పించాలని భావించారు. అప్పుడు నవంబర్‌ నెలను సెలెక్ట్ చేసుకొని ‘నో షేవ్‌ నవంబర్‌’ కాన్సెప్ట్‌ను స్టార్ట్ చేశారు.

చిన్న వయసులోనే తెల్ల గడ్డం ఇబ్బందిపెడుతోందా? - ఇలా చేశారంటే మంచి స్టైలిష్ బ్లాక్ బియర్డ్ మీ సొంతం!

స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి..

ముఖంపై వద్దన్న పెరిగే గడ్డాన్ని మంచి పనికి ఉపయోగించాలని, నవంబర్‌ నెలలో గడ్డానికి పెట్టే ఖర్చును సేవ్ చేసి ఆ మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని వారు ప్రజలను కోరారు. అంతేకాదు.. ‘నో షేవ్‌.ఆర్గ్‌’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. సోషల్​మీడియా, తమ వెబ్‌సైట్‌ ద్వారా క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ.. విరాళాలు ఇవ్వాలంటూ ‘నో షేవ్‌ నవంబర్‌’కు బాగా ప్రచారం కల్పించారు. కొన్నాళ్లకు ఈ సంప్రదాయం అమెరికాలో బాగా ట్రెండ్‌ అయింది. ఆ తర్వాత ఇది ప్రపంచమంతటా వ్యాపించింది.

యువతులూ ఆ ఖర్చు ఆదా చేసి విరాళం!

ప్రస్తుతం ఈ సంస్థ ఆన్‌లైన్‌లో ‘నో షేవ్‌ నవంబర్‌’ లోగోలతో దుస్తులు, ఫ్యాషన్‌ వస్తువులను విక్రయిస్తోంది. వీటి ద్వారా వచ్చే డబ్బునూ క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమాలకు, స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందిస్తోంది. కొత్తగా ఏ ట్రెండ్‌ వచ్చినా ఫాలో అయ్యే యూత్.. ఈ సంస్థ తీసుకొచ్చిన ‘నో షేవ్‌ నవంబర్‌’నూ బాగా ఫాలో అవుతుంది. అయితే, యువకులే కాదు, యువతులు కూడా నవంబర్​లో చేతులు, కాళ్లపై పెరిగే వెంట్రుకలను తొలగించడం కోసం చేసే ఖర్చును ఆదా చేసి విరాళమిస్తున్నారట!

బియర్డ్‌ ఆయిల్‌ Vs బియర్డ్‌ బామ్‌- స్టైలిష్‌ లుక్ కోసం ఏది బెటర్ ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.