Herbal Tea Controls Blood Pressure: ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా చాలా మంది అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే బీపీ అదుపులో ఉండేందుకు రకరకాల మందులను వాడుతుంటారు. ఉప్పును కూడా చాలా వరకు తగ్గిస్తుంటారు. అయినా సరే.. రక్తపోటు అదుపులో ఉండట్లేదని చాలా మంది బాధపడుతుంటారు. ఇలాంటి వారు హెర్బల్ టీలను తాగడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
మందార టీ :మందార పువ్వులతో చేసిన టీ తాగడం వల్ల రక్తపోటు తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. 2010లో Journal of Human Hypertensionలో ప్రచురితమైన అధ్యయనం ఈ విషయం తెలిపింది. Hibiscus sabdariffa extract reduces blood pressure in hypertensive individuals అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలో మెక్సికో పరిశోధకులు A. Herrera-Arellano పాల్గొన్నారు. మందార టీలోని గుణాలు రక్తనాళాలను విశాలం చేసి.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయని వివరించారు. ఫలితంగానే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లోకి వస్తుందని వైద్యులు వివరించారు.
తులసి టీ:తులసిని ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ మొక్కగా పరిగణిస్తారు. ఇలాంటి తులసి టీని తాగడం వల్ల అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ టీ ముఖ్యంగా అధిక రక్తపోటును తగ్గిస్తుందని వివరించారు.
సోంపు టీ:మన ఇంట్లో లభించే సోంపును నీటలో మరగబెట్టి దీనిని తయారు చేస్తారు. ఈ టీని తాగడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మీ రక్తపోటును అదుపులో ఉంచుతుందని వైద్యులు చెబుతున్నారు.
చమోమిలే టీ:ఈ టీని చామంతి జాతికి చెందిన ఆకులతో తయారు చేస్తారు. ఈ చమోమిలే టీని తాగడం వల్ల రక్తపోటు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు.
అల్లం టీ:టీలో అల్లం వేసుకుని తాగుతుంటారు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. ఇలాంటి అల్లం ముక్కలను నీటిలో వేసి ఉడికించాలని.. ఆ తర్వాత నీటిని వడకట్టుకుని తాగాలని సూచిస్తున్నారు. దీనిని తాగడం వల్ల బ్లడ్ ప్రెషర్ అదుపులోకి వస్తుందని చెబుతున్నారు.