These Vitamins Must Required Every Man after 30 Years :పురుషులు 30 ఏళ్ల తర్వాత కూడా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇప్పుడు చెప్పబోయే విటమిన్లు(Vitamins), ఖనిజాలు శరీరానికి తగిన మొత్తంలో అందేలా చూసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. లేదంటే వివిధ ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
విటమిన్ D :30 ఏళ్ల తర్వాత పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలు క్షీణించడం జరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇది ఎనర్జీ లెవల్స్, మజిల్ పవర్‌పై ప్రభావం చూపుతుంది. కాబట్టి అలాంటి టైమ్‌లో 'విటమిన్ డి' చాలా అవసరమంటున్నారు నిపుణులు. ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడమే కాకుండా ఎముకల ఆరోగ్యానికి, గుండె జబ్బుల నివారణకు చాలా బాగా సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
విటమిన్ B12 :30 ఏళ్లు దాటాక ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను, బలమైన నాడీ వ్యవస్థను మెయిన్‌టెయిన్ చేయడం చాలా ముఖ్యం. ఇందుకోసం విటమిన్ B12 చాలా కీలకంగా పనిచేస్తుంది. అంతేకాదు, మానసిక స్థితి, జ్ఞాపకశక్తిని మెరుగుపర్చడంలో కూడా సహాయపడుతుంది. దీనిని సహజంగా జంతు ఉత్పత్తుల నుంచి పొందవచ్చు. అయితే, శాకాహారులకు మాత్రం తగినంత విటమిన్ B12 కోసం బలవర్ధకమైన ఆహారాలు, సప్లిమెంట్స్ అవసరం కావొచ్చంటున్నారు నిపుణులు.
2013లో "జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ"లో ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం.. 30 ఏళ్ల తర్వాత విటమిన్ B12 స్థాయిలు తక్కువగా ఉన్న పురుషులకు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ పరిశోధనలో చైనాలోని బీజింగ్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రముఖ డాక్టర్. ఎక్స్. యు. జాంగ్ పాల్గొన్నారు. 30 ఏళ్ల తర్వాత విటమిన్ B12 తగిన మొత్తంలో లేకుండా గుండె జబ్బుల ప్రమాదం పొంచి ఉంటుందని పేర్కొన్నారు.
విటమిన్ B6 :పురుషులు 30 ఏళ్ల తర్వాత తగినమొత్తంలో తప్పక కలిగి ఉండాల్సిన మరో విటమిన్.. B6. ఈ విటమిన్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది చేపలు, పౌల్ట్రీ, కొన్ని రకాల ధాన్యాలు, బాదం, పొద్దుతిరుగుడు గింజలు వంటి వాటిలో ఎక్కవగా లభిస్తుందని చెబుతున్నారు.
వృద్ధాప్యం శాపం కావొద్దంటే - 30 ఏళ్లు దాటిన వారు ఇవి తినొద్దు!