Best Oils for Natural Glowing Skin: చర్మాన్ని రక్షించడంలో కొన్ని ఆయిల్స్ బాగా పనిచేస్తాయి. అయితే ఫేస్‌కు ఆయిల్ రాయాలంటే.. చాలా మంది ఆందోళన చెందుతారు. ఎందుకంటే నూనె రాస్తే ముఖం జిడ్డుగా మారుతుందని, నల్లగా అవుతుందని, చర్మ సమస్యలు ఎక్కువవుతాయని, అందం దెబ్బతింటుందని టెన్షన్ పడుతుంటారు. కానీ, చర్మాన్ని రక్షించడానికి, అందాన్ని రెట్టింపు చేయడానికి, ఏజింగ్ ప్రక్రియను తగ్గించడానికి నూనెలు సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. ఇవి చర్మానికి పోషణ అందించి లోలోపలి నుంచి చర్మానికి మెరుపును అందిస్తాయి. వీటిని రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ దూరమై స్కిన్ యవ్వనంగా మారి మెరిసిపోతుంది. మరి మీ అందాన్ని సంరక్షించే.. నేచురల్ ఆయిల్స్ ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఆల్మండ్ ఆయిల్: బాదం నూనెలో విటమిన్ ఎ, విటమిన్ ఇ , విటమిన్ డి, జింక్, ప్రొటీన్లు, పొటాషియం ఉంటాయి. ఈ నూనె నేచురల్ సన్‌స్క్రీన్‌లా పనిచేస్తుంది. అలాగే ఎండ వల్ల కమిలిన చర్మాన్ని నార్మల్ చేస్తుంది. అంతేకాకుండా ఇందులోని పోషకాలు యాంటీ ఏజింగ్ కారకాలుగా పనిచేస్తాయి. దీన్ని తరచూ రాసుకోవడం వల్ల ముడతలు కూడా మాయమవుతాయి. మాయిశ్చరైజర్‌కు బదులుగా బాదం నూనెను వాడితే చర్మం మృదువుగా మారడమే కాదు కాంతివంతంగా మారుతుంది. కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌తో బాధపడేవారికి.. ఇది మంచి రిలీఫ్ అందిస్తుంది.
పాలకూరను ఇలా తీసుకుంటే- క్యాన్సర్ దూరం!
జొజోబా ఆయిల్..:జోజోబా ఆయిల్ చాలా తేలికగా ఉంటుంది. దీన్ని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. జోజోబా గింజల నుంచి తీసే ఈ నూనెలో విటమిన్ బి, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఈ నూనె చర్మ రంధ్రాలను అడ్డుకోకుండా నేరుగా చర్మరంధ్రాలలోకి వెళ్లి స్కిన్‌ని రిపేర్ చేస్తుంది. చర్మానికి పోషణ ఇస్తుంది. పొడి చర్మం, డెలికేట్ స్కిన్ ఉన్నవారికి ఇది సూపర్ ఆయిల్ అని నిపుణులు అంటున్నారు.
ఆర్గాన్ నూనె..:ఆర్గాన్ నూనెను లిక్విడ్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. చర్మానికి తేమను అందించడం మాత్రమే కాకుండా యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. డ్రై స్కిన్, ఫ్లాకీనెస్‌ను ఎదుర్కోవడంలోనూ, చర్మం మీద గీతలు, గరుకుదనం తగ్గించడంలోనూ సహాయపడుతుంది.