These Foods Should Never Cooked in Pressure Cooker: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో జనాలు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది వంట త్వరగా పూర్తి కావాలనే ఉద్దేశంతో ప్రెషర్ కుక్కర్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే.. అందులో ఎప్పుడూ వండకూడని కొన్ని ఆహారాలు(Foods) ఉన్నాయని మీకు తెలుసా? వాటిని ప్రెషర్ కుక్కర్లో వండడం ద్వారా అవి రుచిని కోల్పోవడమే కాకుండా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంటున్నారు నిపుణులు. ఇంతకీ.. అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సీఫుడ్ : మీరు ఎప్పుడూ ప్రెషర్ కుక్కర్లో సీఫుడ్ వండకూడదు. అందులో ముఖ్యంగా సున్నితమైన చేపలు, రొయ్యలు వంటివి ఉండికించకూడదు. ఎందుకంటే అవి ప్రెషర్ కుక్కర్ ఆవిరికి త్వరగా ఉడికి మెత్తగా మారుతాయి. ఆకృతిని, రుచిని కోల్పోతాయి.
ఫ్రైడ్ ఫుడ్స్ : కరకరలాడే వడలు లేదా ఫ్రైడ్ ఫుడ్స్ కూడా ప్రెజర్ కుక్కర్లో వండకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. మీరు ఓపెన్ మూతతో ఉడికించినా ఆశించినంత ఫలితం ఉండదు. ఎందుకంటే ప్రెజర్ కుక్కర్లో ఆహారాలు ఆవిరి మీద ఉడుకుతాయి. అలాగే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కుక్కర్లో వండితే టేస్ట్ కోల్పోతాయి.
పాస్తా : మీరు ప్రెజర్ కుక్కర్లో ఎప్పుడూ వండకూడని మరో ఆహార పదార్థం పాస్తా. ఎందుకంటే అందులో పాస్తా అతిగా ఉడకడం వల్ల అది అధిక సాచురేటెడ్ కంటెంట్ హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుంది. అది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి ఎప్పుడూ పాస్తాను ఒక కుండలో లేదా మరేదైనా పద్ధతిని ఉపయోగించి పాస్తాను విడిగా ఉడికించడం ఉత్తమం.
పాల సంబంధిత ఉత్పత్తులు :పాడి ఆధారిత రుచికరమైన వంటకాలు, సాస్‌లు చేయడానికి ప్రెజర్ కుక్కర్ ఉపయోగించకపోవడం మంచిది. ఎందుకంటే పాల సంబంధిత ఉత్పత్తులు ప్రెజర్ కుక్కర్లోని అధిక పీడనం, ఉష్ణోగ్రత కారణంగా అవి రుచిని, ఆకృతిని కోల్పోతాయి. పాలు, జున్ను లాంటివి దానిలో వేడి చేయడం వలన త్వరగా విరిగిపోతాయి. ఒకవేళ వీటిని తీసుకున్నా ఆరోగ్యం పాడవుతుంది.