Summer Cold Remedies :సాధారణంగా శీతాకాలంలో, వర్షాకాలంలో చాలా మందికి జలుబు చేస్తుంది. వేసవి కాలంలో ముక్కు కారడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. దీన్నే సమ్మర్ కోల్డ్ అని పిలుస్తుంటారు ఆరోగ్య నిపుణులు. వాతావరణంలో మార్పులు, విపరీతమైన వేడి కారణంగా ఎండాకాలంలోనూ కొందరికి జలుబు చేస్తుంది. తుమ్ములతో పాటు దగ్గు, జ్వరం, కండరాల నొప్పులు, నోట్లో పొక్కులు, గొంతు నొప్పి, గొంతులో మంట వంటి సమస్యలు కూడా వేసవి కాలంలో వస్తుంటాయి. కారణాలేవైనప్పటికీ జలుబు చేస్తే ఏ పని మీద ధ్యాస పెట్టలేం. ముక్కు దిబ్బడ మనిషిని అస్సలు ప్రశాంతంగా నిద్రపోనివ్వదు. వేసవి కాలంలో వచ్చినా సరే జలుబు దాదాపు వారం రోజుల వరకు ఇబ్బంది పెడుతుంది. వేసవి కాలంలో వచ్చే ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం రావడానికి ఇంట్లోనే కొన్ని నివారణలు ఉన్నాయట. అవేంటంటే.
1. హైడ్రేషన్
జలుబు చేసినప్పుడు బాగా ఇబ్బంది కలిగించే సమస్య శ్లేష్మం. గొంతులో, ముక్కులో పేరుకుపోయిన శ్లేష్మం ఊపిరానివ్వకుండా చేస్తుంది. ఇది తగ్గడానికి శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా అవసరం. వేసవి జలుబు నుంచి మరింత త్వరగా తప్పించుకునేందుకు గోరు వెచ్చటి నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగచ్చు. ఉప్పు నీటిని ఎక్కువ సార్లు పుక్కిలించాలి.
2. విటమిన్-సీ
విటమిన్-సీ, విటమిన్-కే అధికంగా ఉండే కూరగాయలు, ఆహారాలు మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే వేసవిలో వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు.