ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / health

మోకాళ్ల నొప్పులకు భలే మందు - బ్రెస్ట్ క్యాన్సర్​కి ది బెస్ట్ ఫ్రూట్​! - Lychee Fruit Benefits - LYCHEE FRUIT BENEFITS

Lychee Fruit Benefits : చూడగానే నోరూరించే ఎర్రని లిచీ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్లతో పాటు ఇందులోని ఖనిజాలు వృద్ధాప్యాన్ని నియంత్రించేలా సహకరిస్తాయి. మోకాళ్ల నొప్పుల నివారిణిగా లిచీ పండ్లు ఉపయోగపడతాయి. బ్రెస్ట్ క్యాన్సర్​ను అడ్డుకోవడంలో ది బెస్ట్ ఫ్రూట్​ కూడా ఇదే.

lychee_fruit_benefits
lychee_fruit_benefits (ETV Bharat Health Team)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 21, 2024, 3:04 PM IST

Updated : Aug 21, 2024, 7:00 PM IST

Lychee Fruit Benefits :రోడ్ల పక్కన స్ట్రాబెరీ పండ్లను పోలిన ఎర్రని లిచీ పండ్లు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తాయి. చూడముచ్చటైన అందంతో పాటు రుచిగానూ ఉంటాయి. చూడచక్కని లిచీపండు రుచితో పాటు ఎన్నో పోషకాలనూ అందిస్తుంది. దీన్ని తరచూ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. వీటిలోని మెగ్నీషియం, ఫాస్పరస్‌ ఎముకను బలోపేతం చేస్తాయి. వృద్ధాప్యంలో ఎముకలు బలహీనం కాకుండా నియంత్రిస్తాయి. వయస్సు మీరిన వారిని మోకాళ్ల నొప్పులూ, కాళ్లు, కీళ్ల నొప్పుల బారిన పడకుండా కాపాడడంతోపాటు పిల్లల ఎదుగుదలకు కూడా లిచీ పండ్లు సహకరిస్తాయి.

పండు చిన్నదే ప్రయోజనాలు అనేకం - ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదలరు - CARISSA CARANDAS

  • లిచీ పండ్లలో విటమిన్‌-బి6, విటమిన్‌-సి, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, ఫాస్సరస్, ఫైబర్‌ అధికంగా ఉంటాయి.
  • శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ ప్రభావాన్ని తగ్గించడంతో పాటు రొమ్ము క్యాన్సర్‌ బారినపడకుండా సహకరిస్తుంది.
  • రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
  • లిచీ పండ్లు జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. తద్వారా జీర్ణప్రక్రియ సాఫీగా సాగేలా ఉపయోగపడతాయి.
  • విటమిన్‌-సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అతిసార, కలరా, టైఫాయిడ్‌ లాంటి అంటువ్యాధుల బారినపడకుండా సంరక్షిస్తుంది.
  • ఎముక దృఢత్వానికి దోహదపడే మెగ్నీషియం, ఫాస్పరస్‌ ఈ పండ్లలో లభిస్తాయి. దీంతో వృద్ధాప్యంలో ఎముకలు పెళుసు బారకుండా, మోకాళ్ల నొప్పులూ, కాళ్లు, కీళ్ల నొప్పుల బారిన పడకుండా మేలు చేస్తాయి.
  • లిచీ పండ్లు పిల్లల ఎదుగుదలకు దోహదపడతాయి. హై బీపీతో బాధపడే వారు లిచీ పండ్లను తినడం మంచిదే. ఇందులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
  • ఇనుము, కాపర్‌ ఖనిజాలు ఉండటం వల్ల ఎర్రరక్త కణాలు వృద్ధి చెందుతాయి. రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచి రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.
  • ముఖం, శరీరం మీద ముడతలు రాకుండా వృద్ధాప్యాన్ని వాయిదా వేసుకునేలా లిచీ పండ్లు ఉపయోగపడతాయి.
  • పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించడంతో పాటు మధుమేహులకు ఇవి వరం అని చెప్పుకోవచ్చు.
  • వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించకుండా వాటి వృద్ధినీ అడ్డుకునే లక్షణాలు లిచీ పండ్ల ప్రత్యేకం.
  • ఉబ్బసం, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు, అధిక బరువుతో బాధపడే వారికి లిచీ మంచిదే.
  • లిచీలో అధికంగా ఉండే పాలిపినాల్స్ గుండెను ఆరోగ్యం ఉంచడంతోపాటు క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా అరికడతాయి.
  • లిచీ పండ్లు తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్‌ సమస్యను అడ్డుకోవచ్చు. విటమిన్-C ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తుంది.
  • తెల్ల రక్త కణాల పనితీరును మెరుగు పరచడంతో పాటు శరీరంలోని బాక్టీరియాలు, వైరస్‌లను నాశనం చేస్తుంది.

లిచీ పండ్లు అధికంగా తీసుకుంటే అనర్థమే!

ఏదైనా సరే మితంగా తినడమే మంచిదంటారు నిపుణులు. లిచీ పండ్లను కొద్ది కొద్దిగా తీసుకుంటే అందులోని పోషకాలను శరీరం చక్కగా గ్రహిస్తుంది. కానీ అధికంగా తీసుకుంటే అనర్థమే. లిచీ పండ్లలోని ప్రమాదకర రసాయనాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని పలు పరిశోధనలు వెల్లడించాయి.

ముఖ్య గమనిక : ఈ వెబ్ సైట్ లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కడుపులో నొప్పిగా ఉందా? - లిక్కర్​కి లివర్​కి మధ్య పోరాటమే కావొచ్చు! - alcohol vs liver

కొరియన్​ మహిళల బ్యూటీ సీక్రెట్​ ఇదే- అందానికి ఆ అలవాట్లే అతి ముఖ్యం - Korean beauty secret

Last Updated : Aug 21, 2024, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details