Habits to Prevent Premature Hair Loss:ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ ఎదుర్కొంటున్నారు. సాధారణంగా రోజూ కొన్ని వెంట్రుకలు రాలడం సహజం. కానీ, పలు కారణాల వల్ల చాలా మందిలో ఎక్కువ మొత్తంలో వెంట్రుకలు రాలి.. జుట్టు పల్చగా మారిపోతోంది. దీంతో బట్టతల సమస్య తలెత్తుతోంది. ఆ కారణంగా చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తూ.. నలుగురిలో తిరిగేందుకు ఇబ్బందిపడుతుంటారు. ఈ క్రమంలో జుట్టు రాలే సమస్య నుంచి బయటపడేందుకు రకరకాల హెయిర్ ఆయిల్స్, షాంపూలు, మందులు వాడుతుంటారు. అలాగే కొన్ని చిట్కాలు పాటిస్తుంటారు. ఇవన్నీ చేసినా కూడా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ వేధిస్తోందా? అయితే ఈ ఆరోగ్యకరమైన అలవాట్లు డైలీ ఫాలో అయ్యారంటే చాలు.. మీ జుట్టు రాలే సమస్య ఇట్టే తగ్గిపోతుంది.
సమతుల్య ఆహారం: చిన్న వయసులోనే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్‌తో ఇబ్బందిపడుతున్నట్లయితే మీ లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేయాలి. అందులో ముఖ్యంగా మీ డైట్లో సమతుల్య ఆహారం ఉండేలా చూసుకోవాలి. ఇది జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీరు రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్లు, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు అధికంగా ఉండేలా చూసుకోండి. అందుకోసం వివిధ రకాల పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు, తృణధాన్యాలు, గుడ్లు, చేపలు వంటి ఆహారాలు మీరు తినే ఫుడ్‌లో చేర్చుకోండి. అదేవిధంగా జంక్ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం మానుకోండి.
ఒత్తిడి నిర్వహణ: ఈ రోజుల్లో జుట్టు రాలడానికి ఒత్తిడి కూడా ప్రధాన కారణం. ఈ ఒత్తిడి కారణంగా శరీరంలోని హార్మోన్లలో మార్పులు వస్తాయి. కాబట్టి రోజులో కొంత సమయం స్ట్రెస్ కంట్రోలింగ్ వ్యాయామాల కోసం కేటాయించాలి. యోగా, ధ్యానం, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ వంటివి చేయాలి.
రెగ్యులర్ వ్యాయామం: శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం కోసమే కాదు.. మీరు హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ నుంచి ఉపశమనం పొందాలన్నా రెగ్యులర్ వ్యాయామం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అలా చేయడం ద్వారా నెత్తి మీద చర్మంతో సహా జుట్టు మూలాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అది జుట్టు పెరుగుదలను, ఆరోగ్యకరమైన స్కాల్ప్‌ను ప్రోత్సహిస్తుంది. ఫలితంగా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? - మీ జుట్టు రకం ఆధారంగా ఇప్పుడే తెలుసుకోండి!