తెలంగాణ

telangana

ETV Bharat / health

"బీపీ" చెక్‌ చేయించుకోవడానికి వెళ్తున్నారా? - ఈ పొరపాట్లు చేస్తే మీ లెక్కలు తారుమారు! - PRECAUTIONS FOR BLOOD PRESSURE

అధిక రక్తపోటు ఆరోగ్యానికి హానికరం - బీపీ చెక్‌ చేయించుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Blood Pressure Measurement
Precautions for Blood Pressure (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2024, 5:55 PM IST

Precautions for Blood Pressure Measurement : ప్రస్తుత రోజుల్లో బీపీ లేనివాళ్లు లేరంటే అతిశయోక్తి కాదేమో! మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి.. కారణాలేమయితేనేం వయసుతో సంబంధం లేకుండా ఏదో అవార్డు వచ్చినట్లుగా ‘నాకూ బీపీ వచ్చింది’ అనేవాళ్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. చాలామందికైతే బీపీ ఉందన్న విషయం కూడా తెలీదు. కాబట్టి.. ప్రతి ఒక్కరూ తరచుగా బీపీ చెక్ చేయించుకోవడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు.

రక్తపోటు (బీపీ) పరీక్ష చేయించుకోవటమే కాదు.. పరీక్ష చేసే సమయంలో కొన్ని పొరపాట్లు అస్సలు చేయొద్దంటున్నారు. ఎందుకంటే.. "జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌" చేపట్టిన ఓ అధ్యయనంలో రక్తపోటు కొలుచుకునేటప్పుడు మనం చేసే ఈ పొరపాట్ల కారణంగా బీపీ రీడింగుల్లో సగటున 6.5 పాయింట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయని వెల్లడైంది. అయితే, ఇంతకీ.. బీపీ చెక్ చేసుకునేటప్పుడు చేయకూడని ఆ పొరపాట్లు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రక్తపోటు పరీక్ష చేయించుకునేటప్పుడు పట్టీని చుట్టిన చేయి సరిగా ఉందో లేదో మరోసారి చూసుకోవాలి. లేకపోతే.. బ్లడ్ ప్రెజర్ రీడింగులు తప్పుగా రావొచ్చు. అదేవిధంగా.. బీపీ పరికరంతో రక్తపోటును కొలుచుకునేప్పుడు చేయి గుండెకుసమానమైన ఎత్తులో ఉండేలా చూసుకోవటం చాలా ముఖ్యమంటున్నారు జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్​ చేపట్టిన పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ కెన్నెత్ వాంగ్.

అలాగే, బీపీ చెక్ చేయించుకునేటప్పుడు.. చేయిని ఒడిలో పెట్టుకోవటం, చేతి కింద దన్ను లేకపోవటం, చేయిని కిందికి వేలాడ దీయటం వంటి పొరపాట్లు చేసినా బీపీ రీడింగుల్లో సగటున 6.5 పాయింట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయని తాము చేపట్టిన అధ్యయనంలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. అందువల్ల.. రక్తపోటు పరీక్ష చేయించుకునేటప్పుడు సరిగా కూర్చోవటంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరమంటున్నారు వైద్య నిపుణులు.

సడెన్​గా "బీపీ డౌన్"​ అవుతోందా? - దీనికి కారణం ఏంటో తెలుసా?

ఈ జాగ్రత్తలు తప్పనిసరి! :

  • ముందుగా బీపీ పరికరం పట్టీ మీ చేయికి తగిన సైజులో ఉండేలా చూసుకోవాలి. అలాగే.. ఆ పట్టీ దుస్తుల మీద బిగించకుండా ఉంటేనే మేలు.
  • కూర్చునే పొజిషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పాదాలను నేలకు తాకించాలి. వీపును కుర్చీకి వెనకాల ఆనించాలి. కాలు మీద కాలు వేసుకొని కూర్చోకుండా.. కాళ్లుఎడంగా పెట్టి తిన్నగా కూర్చున్నాకే పరీక్ష చేయించుకోవాలి
  • పరీక్ష కోసం చాచిన చేయిని గుండెకు సమాన ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. అందుకోసం చేయిని డెస్క్‌ లేదా టేబుల్‌ మీద పెట్టి ఉంచాలి.
  • రక్తపోటును కొలిచేటప్పుడు మాట్లాడటం తగదు. ప్రశాంతంగా ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడుతున్నా, ఆందోళనకు గురైనా రక్తపోటు ఎక్కువగా చూపించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి.. పరీక్షకు ముందు కనీసం 5 నిమిషాలైనా విశ్రాంతిగా కూర్చోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

NOTE:ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

క్లారిటీ: బీపీ ఉంటే జీవితాంతం మందులు వాడాల్సిందేనా? - తగ్గడానికి ఏం చేయాలి? - నిపుణుల ఆన్సర్ ఇదే!

ABOUT THE AUTHOR

...view details