Side Effects Of Potato Chips :చాలా మంది సాయంత్రం వేళ కరకరలాడే స్పైసీ చిప్స్ తింటూ ఎంజాయ్ చేస్తుంటారు. కొందరికైతే ఛాయ్ తాగుతున్నా, భోజనం చేస్తున్నా.. బంగాళదుంప చిప్స్(Chips) తినే అలవాటు ఉంటుంది. మీరు కూడా ఈ చిప్స్ తెగ తినేస్తున్నారా? అయితే.. అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఈ అలవాటు ప్రాణాలకే ప్రమాదంగా మారొచ్చంటున్నారు!
గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుంది :ఆలూ చిప్స్ అధికంగా తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ పెరుగుతుందంటున్నారు నిపుణులు. వీటి తయారీలో నూనె, ఉప్పు అధికంగా యూజ్ చేస్తుంటారు. కాబట్టి ఇవి ఎక్కువగా తింటే బాడీలో రక్తపోటు స్థాయిలు పెరిగి గుండె జబ్బుల సమస్య పెరిగే ఛాన్స్ ఉంటుందంటున్నారు. అంతేకాదు.. వీటిలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది బాడీలో చెడు కొవ్వును పెంచుతుంది. తద్వారా గుండెకు రక్త సరఫరా సరిగ్గా జరగ్గా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.
2019లో "హార్ట్" జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ఆలూ చిప్స్ ఎక్కువగా తినే వ్యక్తులకు గుండె జబ్బులు రావడానికి 28% ఎక్కువ అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో బ్రెజిల్‌లోని సావో పాలో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ మార్కోస్ చావెజ్ పాల్గొన్నారు. ఆలూ చిప్స్ అధికంగా తీసుకునే వారిలో గుండె సంబంధిత జబ్బులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
క్యాన్సర్ ముప్పు : మీరు ఆలూ చిప్స్ అధికంగా తినడం ద్వారా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. చిప్స్‌లో ఉండే అక్రిలమైడ్ అనే రసాయం క్యాన్సర్‌కు కారణమవుతుందట. అమెరికన్ క్యాన్సర్ అసోసియేషన్ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
చిప్స్ టు వైన్- ఆరోగ్యానికి మేలు చేసే అన్‌హెల్తీ ఫుడ్స్ ఇవే!