Poha VS Rice Which Is Better :ఉదయాన్నే మనం తినే ఆహారం రోజంతా మనం ఎనర్జీగా, చురుగ్గా ఉండడానికి దోహదం చేస్తుంది. మనం రోజంతా తినే ఆహారాల్లో బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా ముఖ్యం. రాత్రంతా ఖాళీగా ఉన్న కడుపుకు ఉదయాన్నే మనం సరైన పోషక విలువలు ఉన్న ఫుడ్‌ను అందించడం తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ ఇప్పటికీ చాలామంది ఉదయాన్నే అన్నం తింటుంటారు. సమయం లేకనో లేదా అలవాటు లేకనో ఉదయాన్నే అన్నం, కూర వండేసి కాస్త లంచ్ బాక్సులో, ఇంకాస్త బ్రేక్‌ఫాస్ట్‌గా తినేసి పనులకు వెళ్తుంటారు. మరి అలా ఉదయాన్నే అన్నం తినడం మంచిదేనా? లేక అల్పాహారంగా అటుకులతో చేసిన పోహా లేదా ఉప్మా తినడం బెటరా?
వాస్తవానికి అన్నం బియ్యంతోనే చేస్తారు. మనం పోహాకు ఉపయోగించే అటుకులు కూడా బియ్యంతోనే తయారు చేస్తారు. కానీ రెండింటి పోషక విలువలు వేరు వేరుగా ఉంటాయట. మరి అన్నం, పోహా (అటుకుల ఉప్మా) రెండింటిలో ఎందులో ఎక్కువ పోషకాలుంటాయి? ఉదయాన్నే ఏది తింటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
పోహా పోషక విలువలు!
Poha Health Benefits :100గ్రాముల పోహాలో 70గ్రాముల ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఉంటాయట. అందుకే చాలామంది ఆరోగ్య ప్రియులు, బరువు తగ్గాలనుకునేవారు పోహాకు ఎక్కువ ప్రాధన్యం ఇస్తారు. ఇది కేవలం పోషకాలతో కూడిన ఆహారం మాత్రమే కాదు దీనిని తినడం వల్ల కడుపుకు తృప్తిగా ఉంటుందట.
అన్నంలో
అన్నం విషయానికొస్తే ప్రస్తుతం బియ్యం పాలీష్ చేసి అమ్ముతున్నారు. అలాగే దీంట్లో ఆర్సెనిక్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. 'కన్స్యూమర్ రిపోర్ట్స్'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం ఆర్సెనిక్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం, నాడీ వ్యవస్థ, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయట.
అన్నంతో పోలిస్తే పోహా ఎందుకు మంచిది?
గ్లూటెన్
అన్నంతో పోలీస్తే పోహా ఆరోగ్యకరమైన ఎంపికగా డైటీషియన్లు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పోహాలో చక్కెర శాతం ఉండదు. అలాగే దీని తయారీలో మనం ఉపయోగించే కూరగాయలు కూడా శరీరానికి మేలు చేస్తాయి. నూనె కూడా పోహా తయారీకి తక్కువ పడుతుంది. పోహాలో గ్లూటెన్ తక్కువగా ఉండటం, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.